పార్లమెంటు సమావేశాలు: తెలుగులోనే ఎంపీగా ప్రమాణం చేసిన పసునూరి దయాకర్
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన అనంతరం ఇటీవల వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పసునూరి దయాకర్ పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేశారు. ఆయన తెలుగులోనే ప్రమాణం చేయడం గమనార్హం.
ఆ తర్వాత కొత్తగా పార్లమెంటు సమావేశాలకు హాజరైన పసునూరి దయాకర్‌కు మిగిలిన సభ్యులు అభినందనలు తెలిపారు. ఇటీవల జరిగిన వరంగల్ లోకసభ ఉప ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఏడో వ్యక్తిగా పసునూరి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

కాగా, లోక్‌సభను స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభను హమీద్ అన్సారీ పార్లమెంటు సమావేశాలను ప్రారంభించారు. అనంతరం దయాకర్ తోపాటు కొత్తగా ఎన్నికైన కొత్త ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ఇటీవల మరణించిన పార్లమెంటుసభ్యులు, మాజీ సభ్యులకు పార్లమెంటు నివాళులర్పించింది.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, ఇతర కార్యక్రమాలు జరగవు. ఈ సమావేశాల్లో తొలి రెండు రోజులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గౌరవార్థం ప్రత్యేక సమావేశాలు, తీర్మానంపై చర్చ జరగనుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications