Gudem Mahipal Reddy: ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం.. లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా గెలవకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. పుండు మీద కారం చల్లినట్లుగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. ఉన్నవారిలో ఓ ఎమ్మెల్యే ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. తాజాగా పటాన్ చెరు గులాబీ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు.
కొద్ది రోజుల క్రితం గూడెం మహిపాల్ రెడ్డితో పాటు అతన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లల్లో ఈడీ తనిఖీలు చేసింది. భూగర్భ గనుల శాఖకు భారీగా సీనరేజ్ నిధులు ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో దాడులు నిర్వహించింది. 72.8 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ తవ్వేసి కేవలం 40. 8 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజ్ చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సోదాల్లో పలు కీలకమైన పత్రాలని ఈడీ స్వాధీనం చేసుకుంది.

అప్పుడే మహిపాల్ రెడ్డి వ్యాపార లావాదేవీలు, అకౌంట్స్, మనీ ట్రాన్సాక్షన్స్ పై వివరాలు రాబట్టారు. జులైన 2న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో గూడెం మహిపాల్ రెడ్డి ఈడీ విచారణకు వెళ్లారు. గతంలో రూ.341 కోట్లు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసింది.
ఆమె 108 రోజులుగా తీహార్ జైలులో ఉంటున్నారు. మరోవైపు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంపై జస్టిస్ ఎల్.నరసింహా రెడ్డి ఛైర్మన్ గా విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.












Click it and Unblock the Notifications