వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వాలు విఫలం, ఆ ముగ్గురి స్ఫూర్తితో పోరాటం: పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల స్ఫూర్తితో పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఆ ముగ్గురు పోరాట యోధులను ఏపీ, తెలంగాణ యువత స్మరించుకుంటోందని, ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల్ని తీసుకు రావడంలో ప్రభుత్వాలు విఫలం కావడంపై వారి స్ఫూర్తితో జనసేన పోరాడుతుందన్నారు.

Pawan Kalyan press release on day of sacrifice

'1931లో ఇదే రోజు మాతృ దేశం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ బలిదానం చేశారు. బానిస శృంఖలాల నుంచి భారత మాతని విడిపించేందుకు... భావి తరాల కోసం తమ జీవితాలని అర్పించారు. వారి త్యాగాలు లక్షల మంది మనసుల్ని జ్వలింపచేశాయి. ఈ రోజుకీ ఎక్కడైనా అన్యాయంపై ఎదురుతిరగడంలో ఆ త్యాగధనుల జీవితాలు ఇచ్చిన స్ఫూర్తే ఉంటుంది.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఉరికంబాన్ని ఎక్కే కొన్ని రోజుల ముందు భగత్ సింగ్ తన మాతృమూర్తితో ఇలా అన్నారు.. నేను చనిపోకపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకొంటే... భారత దేశంలో ఉన్న మాతృమూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్ సింగ్ లా కావాలని కోరుకొంటారు. బలీయమైన స్వాతంత్ర్య కాంక్ష ఉన్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవయోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్టశక్తులకు సాధ్యం కాదు.

Pawan Kalyan press release on day of sacrifice

అప్పుడు భగత్ సింగ్ తల్లి ఇలా స్పందించారు.. ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా ఉంటుందంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకొంటుంది. తన బిడ్డ ఉరి కొయ్యని ముద్దాడే ముందు ఇంక్విలాబ్ జిందాబాద్ అనిపించిందా మాతృమూర్తి. భగత్ సింగ్ ఔనత్యాన్ని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఈ విధంగా కొనియాడారు. మేధావి అనే పదానికి అసలైన అర్థం ఏమిటంటే... ఓ వ్యక్తి గొప్ప ఆలోచనలతో పరితపించాలి.

భవిష్యత్ తరాల కోసం, జనం కష్టాల పట్ల స్పృహతో, వారి సంక్షేమం కోసం స్వతంత్రమైన ఆలోచనలతో స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉండాలి. మేధావి అని సాధికారికంగా భగత్ సింగ్ ని పిలిచేందుకు అన్ని అర్హతలూ ఉన్నాయి. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు చేసిన ఆత్మార్పణను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని యువత ఈ రోజు స్మరించుకుంది. ఆర్థికంగా మెరుగైన పరిస్థితుల్ని తీసుకురావడంలో రెండు ప్రభుత్వాలూ విఫలం కావడంపై వారి స్పూర్తితో పోరాడుతుంది. నిస్వార్థంగా, సాహసోపేతమైన ఆ ముగ్గురి త్యాగాలను స్మరించుకొంటూ జనసేన సెల్యూట్ చేస్తోంది. జై హింద్' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

English summary
Jana Sena Chief Pawan Kalyan press release on day of sacrifice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X