ఓసారి కలిశాం, మెసేజ్‌లు: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ కళ్యాణ్
హైదరాబాద్: హైదరాబాద్: సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ తమ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం చెప్పారు. ఆయన సీపీఐ, సీపీఎం నేతలతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
Recommended Video

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ అంశంపై స్పందించారు.

ఆయన పార్టీలోకి వస్తే స్వాగతిస్తానని పవన్ చెప్పారు. గతంలో ఆయన, తాను ఓసారి కలిశామని చెప్పారు. జనసేన పార్టీ ఆవిర్భావం రోజున లక్ష్మీనారాయణ తనకు సందేశం పంపించారని గుర్తు చేసుకున్నారు. తనకు బెస్టఫ్ లక్ చెప్పారన్నారు. ఆ తర్వాత రెండుమూడుసార్లు ఎస్సెమ్మెస్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నామని చెప్పారు.
కాగా, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల వీఆర్ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా సాగుతోంది. ఆయన బీజేపీ వైపు చూస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అటు వద్దని భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications