వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ ఎఫెక్ట్!: డబ్బుల్లేక ఇష్టమైన కారు అమ్మిన పవన్ కళ్యాణ్?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను ఎంతోకాలంగా ఉంచుకున్న, తనకు ఇష్టమైన కారును అమ్మినట్లుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు అతని మంచితనం, ఆర్థిక ఇబ్బందులు కారణమని చెబుతున్నారు.

ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ నేపథ్యంలో పవన్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. తన వద్ద పెద్దగా డబ్బు లేదని, అందుకే తాను గత ఎన్నికల్లో పోటీ చేయలేదని పవన్ కళ్యాణ్ గతంలోనే మీడియాతో చెప్పారు. ఇప్పుడు ఇబ్బందుల వల్ల కారును అమ్మారని అంటున్నారు.

టాలీవుడ్ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారిలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. అలాంటి పవన్ చేతిలో డబ్బులు లేవని తెలుస్తోంది. అవసరం నిమిత్తం తన వద్ద చాలా కాలంగా ఉన్న మెర్సిడెజ్‌ను అతను అమ్మాడని తెలుస్తోంది. ఎవరినై అప్పు అడిగే బదులు అమ్మడమే మంచిదని ఆయన భావించారని సమాచారం.

Pawan Kalyan

2011లో, రామ్ చరణ్ తేజ పెళ్లికి కొద్ది రోజుల ముందు దీనిని పవన్ కొనుగోలు చేశారు. దీని విలువ రూ.1.15 కోట్లు. తనకు సినిమాలు తీయడం వల్లనే డబ్బులు వస్తున్నాయని పవన్ గతంలో చెప్పారు.

పవన్‌ది ఒకరికి సహకరించే గుణమని, ఎవరికో ఏం అత్యవసరం ఏర్పడిందోనని, అందుకే అతను తన కారును అమ్మి, వారికి డబ్బులు ఇచ్చి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు కూడా ఇది అమ్మారనే వాదనలు వినిపిస్తున్నాయి.

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లుగా చెబుతున్నారు. అలాగే, అతను ఎక్కువ సినిమాలు కూడా తీయడం లేదు. తాను నటనకు గుడ్ బై చెప్పి, పూర్తి రాజకీయాల పైన దృష్టి సారిస్తానని కూడా చెప్పిన విషయం తెలిసిందే.

ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... తనకు లగ్జరీ జీవితం గడపడం ఇష్టం ఉండదని, లగ్జరీ ఆర్టికల్స్ లేకుండా తాను బతక గలుగుతానని, తనకు ప్రైవసీగా ఉంటుందనుకుంటే, సామాన్యుడిలో సిటీ బస్సులో కూడా ప్రయాణించేందుకు సిద్ధమని చెప్పారు.

English summary
Jana Sena party chief Pawan Kalyan Sold His Benz Car Due To His Financial Problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X