విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పీడీ యాక్ట్ నమోదు చేస్తున్న తెలంగాణా పోలీసులు

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణా అడ్డుకోవడం తెలంగాణ పోలీసులకు పెద్ద టాస్క్ గా మారింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రానికి, అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు గంజాయిని చేరవేయడం నిత్యకృత్యంగా మారింది. ఇక ఎన్నిసార్లు పోలీసులు కేసులు నమోదు చేసినా, పదేపదే గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించిన తెలంగాణ పోలీసులు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ లను నమోదు చేస్తున్నారు.

తెలంగాణాలో గంజాయి గుప్పు: వరంగల్ లో గంజాయి స్మగ్లర్ల అరెస్ట్, హైదరాబాద్ లో భారీ గంజాయి సీజ్తెలంగాణాలో గంజాయి గుప్పు: వరంగల్ లో గంజాయి స్మగ్లర్ల అరెస్ట్, హైదరాబాద్ లో భారీ గంజాయి సీజ్

 గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెడుతున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు

గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెడుతున్న వరంగల్ కమీషనరేట్ పోలీసులు

తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశారు పోలీసులు. రెండు రోజుల క్రితం ఇద్దరిపై పీడీ యాక్ట్ పెట్టారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న భూక్యా రాము, ఎస్.కె హనీఫ్, కనుమళ్ళ సునిల్ లపై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను జారీ చేశారు. నర్సంపేట్ రూరల్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ సూర్య ప్రసాద్ పీడీ యాక్ట్ ఉత్తర్వులను హైదరాబాద్ లోని చర్లపల్లి కారాగారంలో జైలర్ సమక్షంలో అందజేసారు.

 132 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడిన ముగ్గురిపై పీడీ యాక్ట్

132 కిలోల గంజాయిని తరలిస్తూ పట్టుబడిన ముగ్గురిపై పీడీ యాక్ట్

పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందుకున్న నిందితులు గత నెల 22వ తేదిన ఆంధ్రప్రదేశ్ నుండి సూమారు 13లక్షల విలువైన 132 కిలోల గంజాయిని కారుతో పాటు, ఆటోలో తరలిస్తుండగా నల్లబెల్లి మండలం రామతీర్థం శివారు ప్రాంతంలో వాహనతనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు . వీరి నుండి పోలీసులు గంజాయితో పాటు గంజాయిని తరలిస్తున్న కారు, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకోని నిందితులను జైలుకు తరలించారు.

రెండు రోజుల క్రితం ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

రెండు రోజుల క్రితం ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్

గత రెండు రోజుల క్రితం కూడా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ద్వారపూడి మణికూమార్ అలియాస్ దుర్గా,బానోత్ విద్యా లపై పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇంతేజాగంజ్ ఇన్ స్పెక్టర్ డి. మల్లేష్ నిందితులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులను ఖమ్మంలోని కారాగారంలో జైలర్ సమక్షంలో అందజేసారు. అనంతరం పి.డి యాక్ట్ కింద కేసు నమోదు చేయబడిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

 రైళ్ళలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిపై వారిపై పీడీ యాక్ట్

రైళ్ళలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిపై వారిపై పీడీ యాక్ట్

పీడీ యాక్ట్ నమోదైన నిందితులు విశాఖపట్నం జిల్లాలోని డౌనూరు, చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతాల నుండి సేకరించిన గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసిన వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకింగ్ చేసి రైలు ద్వారా మహారాష్ట్ర, ములుగు, నర్సంపేట ప్రాంతాలకు చేరవేసేవారు. నిందితులు గంజాయి స్మగ్లింగ్ చేసే సమయంలో ఎవరికి అనుమానం కలగకుండా వుందేండుకుగాను గంజాయిని ఖరీదైన బ్యాగుల్లో భద్రపర్చి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారు. ఇదే తరహాలో నిందితులు గత నాలుగు సంవత్సరాలుగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతూ గత అక్టోబర్ నెల 22వ తేదిన టాస్క్ ఫోర్స్ మరియు ఇంతేజార్ గంజ్ పోలీసులకు పట్టుబడ్డారు . వీరి నుండి మూడు లక్షల విలుగల 32కిలోల గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ లు పెడతామని వార్నింగ్

గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ లు పెడతామని వార్నింగ్


యువతను మత్తు బానిసలుగా మార్చి వారి భవిష్యత్తుపై దుష్ప్రభావానికి గురిచేస్తున్న గంజాయి లాంటి మత్తు మందు పదార్థాల అమ్మకాలకు పాల్పడేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా పోలీసులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా గంజాయి అమ్మకాలకు పాల్పడితే సహించేది లేదని ఈ విధమైన చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

English summary
Telangana police are imposing PD act on Ganja smugglers. PD Act on 5 members in warangal police commissionerate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X