ప్రణయ్ హత్య కేసు: అమృత వర్షిణి తండ్రి సహా ముగ్గురిపై పీడీ యాక్ట్
మిర్యాలగూడ: కొద్ది రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో ముగ్గురు నిందితులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ప్రణయ్, అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ప్రణయ్‌ని అమృత కుటుంబ సభ్యులు హత్య చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కేసు విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులపై హత్యతో పాటు గతంలో బెదిరింపులకు పాల్పడిన కేసులు ఉండటంతో ఈ కేసు విచారణ చేసిన ఎస్పీ.. పీడీ యాక్టు నమోదు చేయాలని కోరుతూ కలెక్టర్‌ను కోరారు.

దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు, అతడి సోదరుడు శ్రవణ్, కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న మహ్మద్ అబ్దుల్ కరీంలపై పీడీ యాక్టు నమోదు చేశారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లా కేంద్ర జైలులో శిక్ష అనుభవిస్తున్న వీరిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications