మంత్రి నాయిని నర్సింహా రెడ్డిపై టిడిపి నేత పెద్దిరెడ్డి గెలుపు!

మహీంద్రా లేజర్‌ బ్లేడ్స్‌ కంపెనీ యూనియన్‌ ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలుపొందారు. టిఎన్టీయూసీ తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి అయిదు ఓట్ల మెజారిటీతో నాయిని నర్సింహా రెడ్డి పైన గెలిచారు.

హైదరాబాద్: మహీంద్రా లేజర్‌ బ్లేడ్స్‌ కంపెనీ యూనియన్‌ ఎన్నికల్లో పెద్దిరెడ్డి గెలుపొందారు. టిఎన్టీయూసీ తరఫున పోటీ చేసిన పెద్దిరెడ్డి అయిదు ఓట్ల మెజారిటీతో నాయిని నర్సింహా రెడ్డి పైన గెలిచారు. ఈ ఎన్నికల్లో నాయినిని ఆయన వరుసగా రెండోసారి ఓడించారు.

బాలానగర్‌లోని కంపెనీ ఆవరణలో శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 460 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకు న్నారు. ఇందులో నాలుగు ఓట్లు చెల్లలేదు. పెద్దిరెడ్డికి 196 ఓట్లు వచ్చాయి. హెచ్‌ఎంఎస్‌ యూనియన్ నుంచి పోటీ చేసిన నాయినికి 191 ఓట్లు వచ్చాయి. ఐఎన్టీయూసీ తరఫున బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్‌కు 65 ఓట్లు వచ్చాయి.

Peddi Reddy wins against Nayini in Mahindra elections

కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదని మాట్లాడే నాయకులకు దీటైన సమాధానంగా పార్టీ సభ్యత్వాలు ఆరు లక్షలకు చేరుకున్నట్లు తెలంగాణ టిడిపి ఎన్నికల కమిటీ కన్వీనర్‌ పెద్దిరెడ్డి ఇదివరకే అన్నారు.

పార్టీ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఫిరాయించినా, కింది స్థాయిలో కార్యకర్తలు అలాగే ఉన్నారన్నారు. దానికి టిడిపి సభ్యత్వ నమోదు నిదర్శనం అన్నారు. ఏ రాజకీయ పార్టీ చేపట్టని విధంగా ఓటరు కార్డు నంబరుతో అత్యంత పకడ్బందీగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు వివరిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+