పురుషాంగం పునఃసృష్టి.. భాగ్యనగరం డాక్టర్ల అద్భుతం

హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స సక్సెస్ ఫుల్ గా నిర్వహించి అద్బుతం చేశారు. చిన్నప్పుడు సున్తీ చేయడం వల్ల ఓ యువకుడుకి ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో అతను పూర్తిగా పురుషాంగాన్ని కోల్పోయాడు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి కోల్పోయిన పురుషాంగాన్ని పునరుద్ధరించి ఇప్పుడు అతనికి కొత్త జీవితం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. తొడ, పొట్ట ప్రాంతంలోని రక్తనాళాలు అలాగే మోచేతి నుంచి కండరాన్ని సేకరించి పురుషాంగాన్ని రూపొందించారు. ఆ తర్వాత దాన్ని విజయవంతంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. అయితే ఈ శస్త్రచికిత్సను ఏడాదిన్నర క్రితం చేశారు. ఇప్పుడు అంగస్తంభన కోసం పినైల్ ఇంప్లాంట్ ఏర్పాటు చేయడంతో యువకుడు పూర్తిగా కోలుకున్నట్టు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోమాలియాకు చెందిన 20 ఏళ్ల యువకుడికి నాలుగేళ్ల వయసులో సున్తీ జరిగిందని అన్నారు. ఆ సమయంలో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో అతడికి పురుషాంగాన్ని తొలగించి, వృషణాల కింద నుంచి మూత్రం వెళ్లేలా మార్గం ఏర్పాటుచేశారని చెప్పారు. కానీ అతడికి 18 ఏళ్లు వచ్చే నాటికి మూత్ర విసర్జనలో ఇబ్బందులు తలెత్తడంతో బాధితుడు మాదాపూర్ లోని మెడికవర్‌ ఆసుపత్రిని సంప్రదించాడు. దీంతో అక్కడి వైద్యులు తొలుత మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా సర్జరీ చేసి.. ఉపశమనం కలిగించారు.

Penis reconstruction operation successfully done by hyderabad doctors

మెడికవర్ ఆసుపత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్, పాస్టిక్ సర్జర్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్‌లు ఈ ఆపరేషన్ ని డీల్ చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పురుషాంగాన్ని పునఃసృష్టించి అతడికి అమర్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మైక్రో వాస్క్యులర్‌ సర్జరీ ద్వారా రేడియల్‌ ఆర్టెరీ ఫోర్‌ఆర్మ్‌ ఫ్లాప్‌ విధానంలో తొలుత యువకుడి పురుషాంగాన్ని రూపొందించారు. తమ ప్రయోగం ఫలించడంతో ఏడాదిన్నర కిందట శస్త్రచికిత్స ద్వారా వృషణాల పైభాగంలో దానిని అతికించారు. పురుషాంగం నుంచి మూత్రవిసర్జన జరిగేలా గొట్టాన్ని అమర్చి... మూత్రాశయానికి అనుసంధానం చేశారు.

ఏడాదిన్నర కిందట జరిగిన శస్త్రచికిత్స విజయవంతం అయ్యి బాధితుడు స్పర్శ పొందడంతో అంగస్తంభన కోసం తాజాగా పిలైన్‌ ఇంప్లాంట్‌‌ను అమర్చినట్టు వైద్యులు వివరించారు. ఇప్పుడు యువకుడు పెళ్లి చేసుకుని కొత్త జీవితం గడపవచ్చని భరోసా ఇచ్చారు. అయితే గతంలో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వీర్య గ్రంథి దెబ్బతినడం వల్ల వీర్యం ఉత్పత్తి జరగదని వెల్లడించారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్స తెలంగాణలో జరగం ఇదే మొదటిసారి అని మెడికవర్ వైద్యులు తెలిపారు. ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన వైద్యులకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+