ఇంట్లో ఇద్దరికీ పెన్షన్ పక్కా.!సమస్యలు ఆలకిస్తూ,ప్రజలకు ధైర్యం కల్పిస్తూ కొనసాగుతున్న భట్టి యాత్ర.!
నాగర్ కర్నూల్/హైదరాబాద్: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 77వ రోజు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతోంది. గురువారం ఉదయం లింగాల మండలం అంబటిపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఆవుసలికుంట, లింగాల, నర్సాయిపల్లి క్రాస్ రోడ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దారి పొడవున ప్రజలను భట్టి విక్రమార్క కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎర్రటి ఎండలో భట్టి యాత్ర : అవసలికుంట గ్రామంలో భట్టి పాదయాత్రకు 43 డిగ్రీల ఎండవేడిని లెక్కచేయకుండా ఆడబిడ్డలు బోనాలు ఎత్తుకొని ఎదురు వచ్చి ఘనంగా స్వాగతం పలికారు. తమ కష్టాలు వింటాడని, తమకు భరోసా, ధైర్యం ఇస్తాడని గ్రామస్తులు, అక్కచెల్లెమ్మలు పాదయాత్రలో కధం తొక్కారు. అంతేకాక డప్పు కళాకారులు, నిప్పులు కక్కే ఎండలో, వాయిద్యాలతో దరువులేస్తూ జన నాయకుడికి స్వాగతం పలికారు. వారిని చూసి ఆనందంతోనూ.. ఇంత ఎండలో తన కోసం నిలబడ్డారని ఒకింత బాధను భట్టి విక్రమార్క వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications