ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ పాలనలో పిల్లల్ని కనాలంటేనే జనం భయపడుతున్నారు.. ఎందుకో చెప్పిన బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

ఐదో విడత ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మూడవరోజు ఆదిలాబాద్ జిల్లాలోని గుండేగాం, మహాగాం మీదుగా చాతా వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు. ఈరోజు రాత్రి చాతా సమీపంలో బస చేయనున్నారు బండి సంజయ్.

 గుండేగాం గ్రామ ప్రజలతో బండి సంజయ్ రచ్చబండ

గుండేగాం గ్రామ ప్రజలతో బండి సంజయ్ రచ్చబండ


పాదయాత్రలో భాగంగా గుండేగాం ప్రజలతో సమావేశం ఆయన బండి సంజయ్ అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ లో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ కు అక్కడి ప్రజల సమస్యలను ఏకరువు పెట్టారు. వర్షం వస్తే మా పరిస్థితిని మాటల్లో కూడా చెప్పలేమని పేర్కొన్నవారు, గత ఏడేళ్లుగా పునరావాసం కోసం తిప్పలు పడుతున్నాం అని వెల్లడించారు. ఇక్కడ మంత్రి, ఎమ్మెల్యే మమ్మల్ని చూడడానికి కూడా రావడం లేదు. ప్రశ్నిస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు అంటూ లబోదిబోమన్నారు. వర్షాకాలంలో తమ ఊరు మునిగిపోతున్నా ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుండేగాం ప్రజలు ఏం పాపం చేశారు? కేసీఆర్ .. ప్రశ్నించిన బండి సంజయ్

గుండేగాం ప్రజలు ఏం పాపం చేశారు? కేసీఆర్ .. ప్రశ్నించిన బండి సంజయ్


గుండేగాం ప్రజల బాధలు విని స్పందించిన బండి సంజయ్ మీ పరిస్థితి చూస్తే గుండె తరుక్కు పోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గుండేగాం ప్రజలు ఏం పాపం చేశారు? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. వర్షాకాలంలో ఈ ఊరు మునిగిపోతున్నా ఎందుకు ఆదుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లు కనిపిస్తున్నాయని, అవి సీఎం కేసీఆర్ కు ఎందుకు కనిపించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇక్కడ సొమ్మును పంజాబ్ కు పంచిపెడుతూ మీ బతుకులను గాలికొదిలేస్తారా అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ తో గుండెగాం గ్రామ మునిగిపోతుందని కనీసం సోయలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ మండిపడ్డారు.

పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా అప్పు భారం

పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా అప్పు భారం

ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎంత నాణ్యతా లోపంతో నిర్మించారో చూసామని తెలిపారు. ముట్టుకుంటే పడిపోయే పరిస్థితి ఉంది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్, ఇండ్లు కట్టిమ్మని మీరు అడుగుతున్నారు... మీ తరుపున ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. గుండేగాంలో 250 కుటుంబాలను కాపాడలేనోడు తెలంగాణను ఏం కాపాడతాడు అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పులపాలు చేశారని, కెసిఆర్ పాలనలో పిల్లల్ని కనాలంటే నిజం భయపడుతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా లక్ష ఇరవై వేల రూపాయలు అప్పు పెట్టాడని, ఇక కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయలు సంపాదించారని పేర్కొన్నారు

 ఏక్ నిరంజన్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ

ఏక్ నిరంజన్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ


ఉపాధి హామీ పథకం కింద ఇస్తున్న నిధులను కూడా కేసీఆర్ దారి మళ్లిస్తున్నాడని మండిపడ్డారు . దోచుకున్న సొమ్మును పత్తాలు, డ్రగ్స్, ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెడుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని కేసీఆర్... తన కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని మండిపడ్డారు. మాకు జైళ్లు, పోలీసుల దెబ్బలు కొత్తేమి కాదన్నారు. ఏక్ నిరంజన్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని ఎద్దేవా చేశారు . కెసిఆర్ ఎంతసేపు ఎవరిని ఎలా ముంచాలో చూస్తాడని విమర్శించారు. 8 సంవత్సరాలుగా మీ బాధలను వినని ఈ ప్రభుత్వం, ఇక్కడి మంత్రి, ఎమ్మెల్యే అవసరమా? అని ప్రశ్నించారు. గుండేగాం ప్రజలను ఆదుకుంటావా... ఆదుకోవా కేసీఆర్? చెప్పాలని నిలదీశారు. మీ తరఫున ప్రభుత్వంపై పోరాటం చేస్తామని పేర్కొన్న ఆయన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

బీజేపీ నేతల పాదయాత్రలంటే... కేసీఆర్ గుండెలమీద తంతున్న ఇనుప పద ఘట్టనల్లా ఫీలింగ్!!బీజేపీ నేతల పాదయాత్రలంటే... కేసీఆర్ గుండెలమీద తంతున్న ఇనుప పద ఘట్టనల్లా ఫీలింగ్!!

English summary
In the Bandi Sanjay Padayatra, he commented that people are afraid of having children under KCR's rule because of the debts. KCR was targeted after knowing the problems of the people in Rachabanda in Gundegam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X