నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు: వైఎస్ షర్మిల

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటామని పేర్కొన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ను, కెసిఆర్ కుటుంబ పాలనను టార్గెట్ చేస్తూనే ఉన్నారు.

నిన్నటికి నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన షర్మిల దొర గారి కమిషన్ల కాళేశ్వరం దుస్థితి అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై వెంటనే ఒక దర్యాప్తు కమిషన్ వేయాలని జరిగిన అవినీతిపై విచారణ తక్షణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.

People are ready to oust the dictatorial Talibans kcr and ktr: YS Sharmila

ఇక తాజాగా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం పై మండిపడిన షర్మిల అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నావా కేటీఆర్ అంటూ కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరు అని పేర్కొన్నారు. నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులు మీరు కేటీఆర్ పై నిప్పులు చెరిగారు.

ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లు మీరు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలు మీరని టార్గెట్ చేశారు.కోటి ఎకరాల మాగాణానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు కాజేసిన దోపిడీదారులు మీరన్నారు.ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని మీరు నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులని విమర్శించారు.

3 ఎకరాల భూమి,ఇంటికి 10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేసిన దళిత ద్రోహులు మీరని తిట్టిపోశారు . నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫామ్ హౌజ్ కే.. నియామకాలు మీ ఇంట్లోకే అంటూ విరుచుకుపడ్డారు .

ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి, అత్యాశకు నిదర్శనం అని పేర్కొన్న షర్మిల, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి,నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+