మోడీకి ప్రజల మద్దతు
మోడీకి ప్రజల మద్దతు
హైదరాబాద్: దేశంలో ఒక ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన సర్వే లో 78 శాతం ప్రజలు మోడీకి మద్దతు పలికారని, గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు ఇది రెట్టింపుగా ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ధత్తన్న..రూ.500, రూ.1,000 నోట్ల రద్దుతో ప్రజలు, కార్మిక వర్గాలకు కొంత అసౌకర్యం కలిగింది వాస్తవమేనని, పెద్ద నోట్ల రద్దు అంశంపై మాత్రం ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. సామాన్యులు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ నిర్ణయాన్ని అభినందిస్తున్నారని దత్తన్న తెలిపారు.












Click it and Unblock the Notifications