సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రజలిచ్చిన తీర్పు : మంత్రి తలసాని

హుజుర్‌నగర్ ఉప ఎన్నిక తర్వాత టీఆర్ఎస్‌లొ మరింత జోష్ నింపింది. ఆర్టీసీ సమ్మెతో పార్టీ పరువు మసకబారుతుందనే అలోచనలకు రాష్ట్ర వ్యాప్తంగా మీడీయా విశ్లేషకులు భావించారు. సమ్మెకు మద్దతుగా ఇతర ఇతర ఉద్యోగ సంఘాలుగా మద్దతు తెలపడంతో రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు ఇతర ప్రజాసంఘాలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే... దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చే వరకు టీఆర్ఎస్ గెలుపుపై పలు మీడియా సంస్థలు, ఇతర విశ్లేషకులు కూడ పలు అనుమానాలు వ్యక్తం చేశాయి.

ముఖ్యంగా హుజుర్‌నగర్‌లో సీఎం తలపెట్టిన బహిరంగ సభ వర్షం కారణంగా రద్దుకావడం కూడ టీఆర్ఎస్ వర్గాల్లో కోంత నిరుత్సహం నెలకోంది. అయితే ఉప ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్ఎస్ అన్నట్టు హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు నల్లెరుమీద నడక లాగా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నిక తీర్పు టీఆర్ఎస్ పాలనకు ప్రజలు వేసిన మార్కులకు నిదర్శనమని మంత్రి తలసాని శ్రీనివాసయాదవర్ అన్నారు. ప్రజలు కేసీఆర్‌కు బ్రహ్మరథం పట్టారని, ఇది కేసీఆర్ నాయకత్వానికి ప్రజలిచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు.

people beleave the cm KCR : talasani srinivasa yadav

ముఖ్యంగా ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వంపై నానా యాగీ చేయాలని భావించారని, ఇప్పటికైనా వాళ్లు కళ్లు తెరవాలని ఆయన సూచించారు. ఉప ఎన్నికల్లో గెలుపుతో మరింత ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. ఇక తెలంగాణ ప్రభుత్వ పరిపాలన దేశానికే ఆదర్శమని పేర్కోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+