చెప్పులతో తిరగబడ్డ గిరిజనం: దేవాదుల దుర్గం ప్రాజెక్టు పనుల నిలిపివేత

దేవాదుల దుర్గం గుట్ట ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలపివేయాలంటూ గిరిజనులు తిరగపడింది. గ్రామసభ ఆమోదం లేకుండా పనులను ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులను నిలదీసింది. గ్రామంలోకి అధికారులెవరూ రావొద్దంటూ చెప్పులు,

జయశంకర్‌ భూపాలపల్లి: దేవాదుల దుర్గం గుట్ట ప్రాజెక్టు నిర్మాణం పనులు నిలపివేయాలంటూ గిరిజనులు తిరగపడింది. గ్రామసభ ఆమోదం లేకుండా పనులను ఎలా ప్రారంభిస్తారంటూ అధికారులను నిలదీసింది. గ్రామంలోకి అధికారులెవరూ రావొద్దంటూ చెప్పులు, చీపుర్లతో నిరసన తెలిపడ్డారు.

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని దుర్గం గుట్ట వద్ద ప్రభుత్వం రూ. 1800 కోట్ల వ్యయంతో గోదావరినిపై ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది. నెల రోజుల క్రితం పనులను ప్రారంభించింది. ఏజెన్సీ ప్రాంతంలో ప్రాజెక్టుల నిర్మాణం తప్పకుండా పాలసీ చట్టం ప్రకారం గ్రామసభ నిర్వహించి, ఆమోదంతోనే పనులు చేపట్టాలి.

Local people opposing the Devadula durgam project in bhupalpally.

కానీ అధికారులు ఎలాంటి గ్రామ సభను నిర్వహించకుండా, అక్కడి రైతులకు కనీసం నష్ట పరిహారం, విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా పనులు చేపట్టడాన్ని ఆదివాసీలు అడ్డుకున్నారు. గ్రామసభ నిర్వహించిన తర్వాతే పనులను ఆరంభించాలని పట్టుబ్టారు.

భూమికి భూమి...

ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురయ్యే భూములకు నష్ట పరిహారంతోపాటు ప్రత్యామ్నాయంగా భూములను ఇతర ప్రాంతంలో ఇవ్వాలని ఇక్కడి ఆదివాసీలు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని, డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మాణం చేసి ఇవ్వాలని, తుపాకులగూడెం వద్ద సాగు చేసుకుంటున్న పాల్వాయి జాన్సన్‌కు చెందిన 75 ఎకరాల భూమిని ఆదివాసీలకు ప్టాలు చేయాలని డిమాండ్‌ చేశారు.

చుక్కా నీరు లేదు..

దేవాదుల ప్రాజెక్టును ఈ ప్రాంతంలో నిర్మాణం చేపట్టినా ఇక్కడి భూములకు చుక్కా నీరు ఇవ్వలేదని, కనీసం తాగునీటిని కూడా అందివ్వలేదని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటూరునాగారం పరిధిలోని ఏజెన్సీ మండలాలకు దేవాదుల ప్రాజెక్టు నీటిని అందివ్వాలన్నారు.

ప్రభుత్వ దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ

కన్నాయిగూడెం మండల పరిధిలోని తుపాకులగూడెం దేవాదుల, లక్ష్మీపురం, రాజన్నపేట, గుర్రెపుల కన్నాయిగూడెం గ్రామాలకు చెందిన సుమారు 3 వేల మంది మహిళలు ప్రభుత్వ దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోకి అధికారులెవరూ రావొద్దంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. చివరకు జిల్లా జాయింట్ కలెక్టర్‌ డి అమయ్‌కుమార్‌, ములుగు సబ్‌ కలెక్టర్‌ గౌతమ్‌ గ్రామసభ నిర్వహించి పాల్వాయి జాన్సన్‌కుచెందిన భూములను వెంటనే ప్టాలు చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+