వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగపూర్‌లా హైద్రాబాద్‌లో పోలీస్‌లు కనిపించరు: అద్దాల మేడ నుంచి చూడొచ్చు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సాంకేతికతను అందిపుచ్చుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం అన్నారు. సభ్యసమాజాన్ని చూస్తూ ఎదుగుతూ అనేక విషయాలను అందిపుచ్చుకోవడం అవసరమన్నారు.

ప్రస్తుత సమాజంలో శాంతిభద్రతల పాత్ర కీలకమని, హైదరాబాద్ నగరంలోనూ రాష్ట్రంలోనూ ఆ బాధ్యత నిర్వర్తించడంలో పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషించాలని కెసిఆర్ ఆకాంక్షించారు. ఇది కేవలం పోలీసు శాఖకే కాకుండా ప్రభుత్వానికి టెక్నాలజీ ఫ్యూజన్‌గా హబ్‌గా రూపుదిద్దుకోవాలన్నారు.

బంజారాహిల్స్‌లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న పోలీస్ ట్విన్‌టవర్స్‌కు ముఖ్యమంత్రి ఆదివారం శంకుస్థాపన, భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెసిఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్ నేత వి హనుమంత రావు తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

ఎన్నో ప్రత్యేకతలతో హైదరాబాద్‌లో నూతన పోలీస్‌ కమిషనరేట్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుంది.బంజారాహిల్స్‌లో 24 అంతస్తులతో నిర్మించనున్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

భూమిపూజ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్‌ నూతన పోలీస్‌ కమిషనరేట్‌ ప్రధాన కేంద్రంలో కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో సమకూర్చేందుకు ఇప్పటికే రూ.302కోట్లకు పరిపాలన అనుమతులిచ్చామని, వచ్చే బడ్జెట్‌లో మరో రూ.700 కోట్లు కేటాయిస్తామన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

ఒక్క హైదరాబాద్‌ శాంతిభద్రతల నిర్వహణ కోసమే కాకుండా రాష్ట్రమంతటికీ ఉపయోగపడే అద్భుతమైన టెక్నాలజీ హబ్‌గా ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ఉన్నతాధికారులు ఇక్కడి నుంచే పరిస్థితిని పర్యవేక్షించేలా దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. ముంబైలో తొమ్మిది వేల సీసీకెమెరాల ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటివరకు 600 కెమెరాలను ఏర్పాటు చేశారన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి జంటకమిషనరేట్లలో పదివేల కెమెరాల ఏర్పాటుకు సంకల్పిస్తోందన్నారు. సింగపూర్‌, చైనాల్లో పోలీసులు రహదారులపై కనిపించకుండానే శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

ఏదైనా ఘటన జరిగితే మాత్రం డయల్‌100లాంటి వ్యవస్థ ద్వారా సమాచారం తెలుసుకొని రెండు, మూడు నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంటారన్నారు. అధునాతన సాంకేతికతతోనే అది సాధ్యమవుతుందని, హైదరాబాద్‌లోనూ అలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

సింగపూర్‌లో సన్నిహిత పోలీసింగ్‌ అద్భుత ఫలితాలు సాధిస్తుండటం వల్లే శాంతిభద్రతలు నియంత్రణలో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌లో అలాంటి వ్యవస్థను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

పోలీసులతో మాత్రమే అది సాధ్యం కాదని. పౌరుల సహకారం తప్పనిసరి కావాలన్నారు. గతంలో ఇక్కడి డీజీపీలు అద్భుతమైన పనితీరు కనబరిచారని, వారు పెంచి పోషించిన మొక్కలే నేడు ఫలాలందించే స్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదాన్ని తుద ముట్టించేందుకు సాంకేతికను ఉపయోగించాలని సూచించారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

నకిలీ వీసాలు, పాస్‌పోర్టులకు కేంద్రంగా హైదరాబాద్‌ ఉన్నప్పటికీ నేరస్థులను పట్టుకోవడంలో ఇక్కడి పోలీసులు ముందున్నారని ప్రశంసించారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అంతకుముందు ఎంపీలు కేకే, వీహెచ్‌, అసుదుద్దీన్‌ ఒవైసీ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి, శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, సాయన్న ప్రసంగించారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

ఈ అత్యాధునిక పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో 17వ అంతస్తులో పోలీస్‌ మ్యూజియం, మొదటి టవర్‌పై భాగంలో హెలీప్యాడ్‌ నిర్మిస్తారు. ఏకకాలంలో 740 కార్ల పార్కింగ్‌‌కు సౌకర్యం ఉంటుంది.

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

పోలీస్ కమినరేట్ ప్రధాన కార్యాలయంగానే కాకుండా ఏదైనా విపత్తులు, విపత్కర పరిస్థితులు సంభవించిన సమయంలో కీలక శాఖల ఉన్నతాధికారులు ఒకేచోట ఉండి సమీక్షించేందుకు వీలుగా భవనం రూపుదిద్దుకోనుండటం దీని ప్రత్యేకత.

 అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

అత్యాధునిక పోలీస్ కమిషనరేట్

లోపల భాగంలో ఎండ వేడిమి తగలకుండా మెగా సోలార్ ఫోటో వోల్టాయిక్ రూఫ్‌ను అమర్చుడం మరో విశిష్టత. అలాగే డబుల్ ఇన్సులేటెడ్ అద్దాన్ని వినియోగించనున్నారు. 17వ అంతస్తు నుంచి సందర్శకులు నగరాన్ని వీక్షించేలా ఏర్పాటు చేస్తారు.

English summary
Telangana Chief Minister KCR today laid the foundation stone of Hyderabad Police Commissionerate Headquarters-cum-Integrated Command and Control Centre, which will be built at an estimated cost of Rs 302 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X