గజల్ శ్రీనివాస్ కేసు: 'చెప్పుతో కొట్టాలనుకొన్నా, కెమెరా పెట్టేందుకు వారం రోజులు కష్టపడ్డా'

Posted By:
Subscribe to Oneindia Telugu
  గజల్ శ్రీనివాస్‌పై వేటు: వెనకేసుకొచ్చిన ఏపీ మంత్రి, 20 వీడియోలు

  హైదరాబాద్: ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ రాసలీలను బయటపెట్టేందుకు వారం రోజలు పాటు పక్కా ప్లాన్ వేశాననని భాదితురాలు తెలిపారు.గజల్ శ్రీనివాస్ బెడ్‌రూమ్ గా ఉపయోగించుకొంటున్న గదిలో రహస్యంగా కెమెరాను ఫిక్స్ చేసేందుకు వారం రోజుల పాటు కష్టపడ్డానని బాధితురాలు చెప్పారు.

  గజల్ శ్రీనివాస్ కేసు: 'ఆమె వెనుక ఎవరైనా ఉన్నారేమో, మసాజ్ టైంలో అక్కడే ఉన్నా'

  ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ లైంగిక ఆరోపణల నేపథ్యంలో మంగళవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు బెయిల్ పిటిషన్ పై బుదరవారం నాడు కోర్టులో వాదనలు జరిగాయి. అయితే గురువారం నాడు ఈ విషయమై కోర్టు తీర్పు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

  లైంగిక వేధింపుల వివాదం: మసాజ్ చేయించుకొన్నా, కానీ, నా బిడ్డగా భావించా: గజల్ శ్రీనివాస్

  గజల్ శ్రీనివాస్ ఏ రకంగా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడనే విషయమై బాధితురాలు పక్కాసాక్ష్యాలను పోలీసులకు అందించింది. అయితే ఈ సాక్ష్యాలను రికార్డు చేసేందుకు తాను ఏ రకంగా కష్టపడాల్సి వచ్చిందనే విషయాన్ని భాదితురాలు ఓ తెలుగు మీడియా ఛానల్‌కు వివరించారు.

  కెమెరాను ఫిక్స్ చేసేందుకు వారం రోజులు కష్టపడ్డాను

  కెమెరాను ఫిక్స్ చేసేందుకు వారం రోజులు కష్టపడ్డాను

  గజల్ శ్రీనివాస్ బెడ్ రూమ్ గా ఉపయోగించుకొంటున్న గదిలో రహస్య కెమెరాను అమర్చేందుకు వారం రోజుల పాటు కష్టపడ్డానని భాధితురాలు ప్రకటించారు. ఎక్కడ కెమెరాను అమరిస్తే గజల్ శ్రీనివాస్ బండారం బట్టబయలయ్యే విషయమై పక్కాగా ప్లాన్ చేశానని చెప్పారు.కెమెరాను ఇతరులకు కనబడకుండా ఉండేందుకు కూడ జాగ్రత్తలు తీసుకొన్నట్టు ఆమె గుర్తు చేశారు.

  డబ్బుల ఫిర్యాదు చేయలేదు

  డబ్బుల ఫిర్యాదు చేయలేదు

  డబ్బుల కోసం తాను ఫిర్యాదు చేయలేదని భాధితురాలు చెప్పారు. తాను ఆ తరహ మహిళను కాదని భాదితురాలు చెప్పారు. గజల్ శ్రీనివాస్ కు సహకరించే మహిళ లాంటిదాణ్ణి కాదన్నారు. ఆ విధంగా తాను కూడ ఉంటే తనకు ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు.

  చెప్పుతో కొట్టాలనుకొన్నా

  చెప్పుతో కొట్టాలనుకొన్నా

  తనను లైంగికంగా వేధింపులకు గురిచేసిన గజల్ శ్రీనివాస్ ను చెప్పుతో కొట్టాలని భావించానని బాధితురాలు చెప్పారు. అయితే పోలీస్ స్టేషన్ లో పోలీసులు గజల్ శ్రీనివాస్ ను ప్రశ్నించి అరెస్ట్ చేశారని , కానీ, తనకు చెప్పుతో కొట్టే అవకాశం లభించలేదన్నారు. అయితే పోలీసులు వెంట వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో తనకు అంతకంటే సంతోషం మరోకటి లేదని ఆమె చెప్పారు.

  ఆమె బలవంత పెట్టేది

  ఆమె బలవంత పెట్టేది

  ఈ కేసులో ఎ2 నిందితురాలుగా ఉన్న మరో మహిళ తనను గజల్ శ్రీనివాస్ కు సహకరించాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చేదని చెప్పారు. తనకు పెళ్లైందని, తన ఇంట్లో అన్ని రకాల వస్తువులున్నాయని దానికి గజల్ శ్రీనివాస్ కారణమని ఆమె తనకు చెప్పేవారని బాధితురాలు చెప్పారు. తన మాదిరిగా గజల్ శ్రీనివాస్ కు సహకరిస్తే నీ జీవితం కూడ బాగుపడేదని ఆమె గుర్తు చేశారు.తనను ఒత్తిడి చేసిన మహిళ దృశ్యాలు కూడ వీడియోలో రికార్డయ్యాయి.

  డిసెంబర్ 29న , ఫిర్యాదు చేశా

  డిసెంబర్ 29న , ఫిర్యాదు చేశా

  గజల్ శ్రీనివాస్ భాగోతంపై తాను పోలీసులకు గత ఏడాది డిసెంబర్ 29న ఫిర్యాదు చేసినట్టు భాదితురాలు చెప్పారు. ఈ కేసులో ఎ2 నిందితురాలుగా ఉన్న మరో మహిళ సహకరించిన విషయాలన్నీ కూడ వీడియోల్లో రికార్డైన విషయాలను ఆమె గుర్తు చేశారు. అయితే తాను మాత్రం సాక్ష్యాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె గుర్గు చేశారు. భవిష్యత్తులో ఎవరికీ ఈ తరహ ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతో తాను ధైర్యంగా వ్యవహరించానని చెప్పారు.

  వీడియోలో ఎలాంటి మార్పింగ్ లేదు

  వీడియోలో ఎలాంటి మార్పింగ్ లేదు

  గజల్ శ్రీనివాస్ పై కేసు నమోదు వెనుక ఏ వర్గమూ లేదన్నారు. దాదాపు 20 వీడియోలను పోలీసులకు ఇచ్చానని బాధితురాలు చెప్పారు. ఆ గదిలో కెమెరా ఫిక్స్ చేయడానికి వారం రోజులు పట్టింది. ఎన్నోసార్లు ప్రయత్నించాక వీడియో రికార్డు చేయడం సక్సెస్ అయిందన్నారు.. వీడియోల్లో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదు. తప్పు చేసిన వాడిని ఎదిరించడం తప్పా? ఆడదంటే అబల కాదు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా ఎదురుతిరుగుతుందన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ghazal Srinivas victim said that she had planned a weekly plan to expose Ghazal Srinivas sexual harassment.A Telugu Channel interviewed her on Wednesday.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి