చిక్కుల్లో స్మితా సబర్వాల్ - వాట్ నెక్స్ట్..!!
ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ పైన హైకోర్టులో పిల్ దాఖలైంది. దివ్యాంగులపై స్మితా సబర్వాల్ కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌లో యూపీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్దించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్మిత సబర్వాల్ ఇటీవల దివ్యాంగుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ చిక్కుల్లో చిక్కుకున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న స్మిత సబర్వాల్ పైన హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలయింది. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ ఇటీవల దివ్యాంగుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ లుగా దివ్యాంగులకు రిజర్వేషన్లను తీసి వేయాలన్నారు. వారుప్రజాసమస్యలపై వెంటనే స్పందించే అవకాశముండదని ఆమె అభిప్రాయపడ్డారు. చేసిన ట్వీట్... ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని ఆమె ట్వీట్ చేశారు.

దీనిపై అనేక మంది అభ్యంతరం తెలిపారు. కొందరు ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్‌కు నేరుగా కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే చివరకు ఆమె ట్వీట్ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. దివ్యాంగుల కోటాపై స్మితా సబర్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలపై గత కొంతకాలంగా చర్చ నడుస్తోంది. స్మితా వ్యాఖ్యల పైన సోషల్ మీడియా వేదికగా అనుకూల - ప్రతికూల వాదనలు జరిగాయి. కొందరు మేధావులు స్మిత వ్యాఖ్యలను ఖండించారు. ఇక, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications