రామ్ గోపాల్ వర్మకు వంగవీటి రాధా ఝలక్: వంగవీటిపై పిటిషన్, హైకోర్టు నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం 'వంగవీటి' సినిమా పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ బుధవారం నాడు హైకోర్టు గడప తొక్కారు. ఈ నేపథ్యంలో దర్శకుడు, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

దివంగత నాయకుడు వంగవీటి మోహన రంగా జీవిత చరిత్ర ఆదారంగా రామ్ గోపాల్ వర్మ 'వంగవీటి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఈ చిత్రం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని వంగవీటి రాధా తన పిటిషన్‌లో పేర్కన్నారు.

vangaveeti

పిటిషన్ స్వీకరించిన హైకోర్టు దర్శకుడు రాం గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Petition filed in High Court over Vangaveeti film.
Please Wait while comments are loading...