నియో పోలిస్ ఫేజ్-2 భూముల వేలం రికార్డు: ఎకరం రూ. 72 కోట్లు, హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం

హైదరాబాద్: భూముల వేలంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(HMDA)భారీగా ఆదాయాన్ని తీసుకొస్తోంది. కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూముల వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకడం గమనార్హం. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధర నిర్ణయించింది.

ఈ క్రమంలో భూముల వేలంలో దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు పోటీపడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి రూ. 72 కోట్లు పలకడం విశేషం. అత్యల్పంగా రూ. 51.75 కోట్లు పలికిగింది. నియో పోలిస్ ఫేజ్-2లోని 6,7,8,9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది.

phase-2ofneopolislayout1

తాజాగా నిర్వహించిన వేలంతో ఇప్పటి వరకు కోకాపేట నియో పోలిస్‌లో 26.86 ఎకరాల వేలం పూర్తయింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 18.47 ఎకరాలకు వేలం నిర్వహించనున్నారు. ప్రస్తుతం నియో పోలిస్‌లో 10,11,14 ప్లాట్ల వేలం కొనసాగుతోంది. వేలం జరుగుతున్న ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉంది.

భూముల వేలంలో రియల్టర్లు పోటీ పడుతుండటంతో భూముల ధరలు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. కాగా, ఈ వేలం ద్వారా మొత్తం దాదాపు రూ. 2500 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో ఇదే ప్రాంతంలో వేలం నిర్వహించగా.. కనిష్టంగా ఎకరాకు రూ. 31 కోట్లు.. గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది. ఏడాది తర్వాత ఇప్పుడే ఏకంగా ఎకరంకు అప్పటికంటే రూ. 10 కోట్లు పెరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+