'ఖబడ్దార్ కేసీఆర్.. కీలక విద్యుత్ శాఖకి మంత్రి వద్దా'
నిజామాబాద్: తెలంగాణలో విద్యుత్ కోతలకు తెరాసనే కారణమని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తూ కేసీఆర్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభుత్వం చేతగాని తనాన్ని ఎండగడుతూ, రైతులకు భరోసా కల్పించేందుకు ఉద్దేశించిన రైతు భరోసా యాత్రకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది.
బతికుండి ప్రభుత్వంపై పోరాడాలని, సమస్యలను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా టీపీసీసీ నేతలు రైతులకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య యాత్రను ప్రారంభించారు.

తెలంగాణ కాంగ్రెస్
గాంధీ భవన్లో ప్రారంభమైన యాత్ర.. అనంతరం ఇక్కడి నుంచి బయల్దేరి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలోని దోమకొండ, భిక్కనూరు మండలాల్లో కొనసాగింది.

తెలంగాణ కాంగ్రెస్
యాత్రలో పొన్నాల లక్ష్మయ్యతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, కాంగ్రెస్ మండలి పక్ష నేత డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత పాల్గొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్
ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ, నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యకు పాల్పడవద్దని, సమస్యల పరిష్కారానికి సర్కారుపై అందరం కలిసి పోరాడుదామని రైతులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్
పంట దెబ్బ తిని, రుణాలు రాక, బీమా అందక ఆందోళన చెందుతున్న రైతులు అధైర్యపడవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా ఉంటుందని అభయమిచ్చారు.

తెలంగాణ కాంగ్రెస్
టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతలు లేవని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏ ఒక్కటీ ఇంకా పరిష్కారం కాలేదని విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్
ఇటు ప్రభుత్వం నుంచి భరోసా లభించక, అటు ప్రకృతి కనికరించక... రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తిరగబడక ముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని ఆయన సూచించారు.

తెలంగాణ కాంగ్రెస్
కేసీఆర్ ఖబడ్దార్!.. నీ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి.. రైతుల సమస్యలు పట్టించుకోకుండా కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తావా? ఎన్నికల ముందు కరెంట్‌పై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్
మీరు అధికారంలోకి వచ్చిన తరువాత 220 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఒక్క కుటుంబాన్నైనా పరామర్శించావా.. ఒక్కరినైనా ఆదుకున్నావా? వేళాపాళాలేని కరెంట్ కోతలతో చేతికొచ్చే సమయానికి పంటలు ఎండుపోతున్నాయి.. రాష్ట్రంలో ఇంత కరెంట్ సంక్షోభం ఉన్నా, నేటికీ విద్యుత్ శాఖ మంత్రిని నియమించవా అని పొన్నాలకేసీఆర్‌పై విరుచుకుపడ్డారు.

తెలంగాణ కాంగ్రెస్
బతుకమ్మ, ఇతర సంబరాలను జరుపుకుంటున్న కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరెంట్ కోతలకు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే కారణమన్నారు.

తెలంగాణ కాంగ్రెస్
రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి 54 శాతం విద్యుత్ వాటా వచ్చే అవకాశం ఉన్నా, పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్
కేంద్రంపై ఒత్తిడి చేయడం లేదన్నారు. కరెంట్ సమస్యను పరిష్కరించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కరెంట్ కొనుగోలు చేస్తామని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేసినా, అది ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదన్నారు.

తెలంగాణ కాంగ్రెస్
రాష్ట్రంలోని రైతులను ఆదుకునేందుకు వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం లేకపోవడం వల్ల ప్రస్తుతం రైతులకు పరిహారం వచ్చే పరిస్థితి లేదన్నారు.

తెలంగాణ కాంగ్రెస్
ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు వచ్చి వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలన్నారు. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications