Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజీవ్ త్రివేదికి సిట్ నోటీసులు: టీ ఉద్యోగుల గరం (పిక్చర్స్)

హైదరాబాద్: కాల్ డాటా ఆధారాలను సమయం వచ్చినప్పుడు కోర్టుముందు ఉంచుతామని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేది చెప్పారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపిస్తూ ఏపీ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావుతోపాటు పలువురు ఇచ్చిన ఫిర్యాదులపై విజయవాడలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసులపై విచారణకు ఏర్పాటైన సిట్ విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ కాల్‌డేటాకు సంబంధించిన ఆధారాలను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోరింది. ఈ మేరకు విజయవాడ కోర్టు కాల్ డాటాను, ఆధారాలను భద్రపర్చాలని తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది.

ఇందుకు సంబంధించిన నోటీసుల కాపీని సిట్ అధికారులు గురువారం సచివాలయంలో త్రివేదీకి ఆయన కార్యాలయంలో అందించారు. నోటీసుల్లో ఉన్నట్టుగానే అన్ని ఆధారాలను భద్రపరుస్తామని రాజీవ్ త్రివేది అనంతరం మీడియాకు తెలిపారు. తమకు న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెప్పారు.

టీ ఉద్యోగుల ఆందోళన

టీ ఉద్యోగుల ఆందోళన

తెలంగాణ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదికి విజయవాడ కోర్టు ఆదేశాలు అందించేందుకు ఏపీ సిట్ అధికారులు తెలంగాణ సెక్రటేరియట్‌కు వచ్చారని తెలుసుకున్న తెలంగాణ ఉద్యోగులు దాదాపు 350మంది ఏ బ్లాక్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.

పెద్ద యెత్తున నినాదాలు..

పెద్ద యెత్తున నినాదాలు..

తెలంగాణ ద్రోహుల్లారా ఖబడ్డార్ అంటూ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యోగులు నినాదాలుచేశారు. ఏ బ్లాక్ 5వ అంతస్తులో ఉన్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి వెళ్లే ప్రయత్నంచేశారు.

ఇచ్చి వెళ్లిపోయారు..

ఇచ్చి వెళ్లిపోయారు..

తెలంగాణ ఉద్యోగులు మెట్లు ఎక్కుతుండగా చూసిన ఆంధ్రా పోలీసులు హడావిడిగా హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌త్రివేదికి నోటీస్‌లు ఇచ్చి, బీ బ్లాక్‌లోకి వెళ్లి అక్కడినుంచి కిందకు దిగి వెళ్లిపోయారు.

సురక్షితంగా బయటకు పంపించారు..

సురక్షితంగా బయటకు పంపించారు..

ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఎస్‌పీఎస్ సిబ్బంది తెలంగాణ సచివాలయం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే, టీజీవో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.

చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపణ

చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో అల్లర్లు సృష్టించేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తరువాత కూడా ఏపీ పోలీసులు వచ్చి నోటీస్‌ల పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు.

మద్రాసు లాగా చేయలేదు..

మద్రాసు లాగా చేయలేదు..

గతంలో మద్రాస్ నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు అక్కడి మద్రాస్ ప్రభుత్వం ఏపీ వారిని రాత్రికి రాత్రే పొమ్మని ఆదేశించినట్లుగా ఇక్కడ ఆదేశించలేదని, పదేండ్లు ఇక్కడ ఉండటానికి అవకాశం ఇస్తే కథలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు అడగడం లేదు..

తెలంగాణకు అడగడం లేదు..

ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కావాలంటున్న చందర్బాబు తెలంగాణకు మాత్రం అడుగడం లేదన్నారు. తెలంగాణను దెబ్బతీసే విధంగా, తెలంగాణకు కేటాయించిన నీటి వాడుకోవడానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు దొంగతనంగా పార్లమెంటులో ప్రశ్నలు వేయించారని విమర్శించారు.

ఇలా వచ్చి వెళ్లారు..

ఇలా వచ్చి వెళ్లారు..

ఎపి సిట్ అధికారులు రాజీవ్ త్రివేదికి నోటీసులు అందజేసి మీడియాతో మాట్లాడుతుండగా తెలంగాణ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ద్రోహుల భరతం పడుతామని..

ద్రోహుల భరతం పడుతామని..

రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ద్రోహుల భరతం పడతామని చెప్పారు. ఈ ఆందోళనలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు సత్యనారాయణ, రవీందర్‌రావు, కృష్ణయాదవ్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+