వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మజ్లీస్ కోట పదిలం: నలుగురు హిందువులు, ఓవైసీ సోదరుల జోష్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్ పాతబస్తీలో మజ్లీస్ కోట పదిలంగా ఉంది. కారు దూకుడికి కాంగ్రెసు, టిడిపి చావు దెబ్బ తింటే, మజ్లీస్ ఓ సీటు ఎక్కువే గెలుచుకుని తన సత్తా చాటింది. ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా తమకు తిరుగులేదని మజ్లీస్ నిరూపించుకుంది. మజ్లీస్ పార్టీ తరఫున పోటీ చేసిన నలుగురు హిందువులు విజయం సాధించారు.

గత ఎన్నికల్లో దక్షిణ మండలంలో 43 డివిజన్లు ఉండగా పోలింగ్‌ కూడా 43 శాతమే జరిగింది. ఎంఐఎంకు 43 శాతం ఓట్లు వచ్చాయి. ఎంఐఎంకు సీట్లు కూడా 43 వచ్చాయి. గత ఎన్నికల్లో టీడీపీకి 29.14 శాతం ఓటు, కాంగ్రెస్‌కు 10.14 శాతం ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 6.87 శాతం సీట్లు వచ్చాయి. నల్లేరు మీద నడకగా విజయం సాధించాల్సిన ఎంఐఎంకి ఈ సారి ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చారు. అయినా ఎంఐఎం తన కోటను కాపాడుకోగలిగింది.

దక్షిణ మండలంలో నాంపల్లి, యాకుతపుర, బహుదూర్‌పుర, మలక్‌పేట, కార్వాన, గోషామహల్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక గోషామహల్‌, రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మినహా అన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పాగా వేసింది. గోషామహల్‌ నియోజకవర్గంలో బీజేపీ గెలవగా, రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది.

బహుదూర్‌పురలో ఎంఐఎంకు 78.46 శాతం ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన టీడీపీకి 8.68 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 69.78 ఉంది. నాంపల్లిలో రెండో స్థానంలో నిలిచిన టీడీపీకి ఎంఐఎం కన్నా 13 శాతం ఓట్లు తక్కువ వచ్చాయి.

ఎంఐఎం జీహెచఎంసీ ఎన్నికల్లో అదే జోరు కొనసాగించింది. బహుదూర్‌పురలోని ఆరు డివిజన్లకు ఆరు, చాంద్రాయణగుట్టలో ఏడు డివిజన్లకు ఏడు స్థానాల్లో గెలుపొందింది. నాంపల్లిలో 7 డివిజన్లకు 5, యాకుతపురలో 7 డివిజన్లకు 5, మలక్‌పేటలో 6 డివిజన్లకు 5, కార్వానలో 6 డివిజన్లకు 5, చార్మినార్‌లో 5 డివిజన్లకు 4 స్థానాల్లో గెలుపొందింది. గోషామహల్‌లో 1, రాజేంద్రనగర్‌లో 2 స్థానాల్లో మాత్రమే గెలవగలిగింది.

ఓవైసీ ఖుషీ..

ఓవైసీ ఖుషీ..

ఎవరి ప్రభజనం ఉన్నా విజయం సాధించడం మజ్లిస్‌ పార్టీకి ఉన్న ప్రత్యేకత అని ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్‌ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన ఒవైసీ అన్నారు.

ట్వీట్ ఇలా..

ట్వీట్ ఇలా..

గ్రేటర్‌ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నామని ఆయన ట్వీట్‌చేశారు.

అయినా గెలిచాం..

అయినా గెలిచాం..

ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌, నరేంద్రమోడీ ప్రభంజనం కొనసాగిన సందర్భంలోనూ తాము గెలిచామని పేర్కొన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ హవా కొనసాగినా విజయవంతంగా ఎదుర్కొని ప్రభంజనం సృష్టించామని చెప్పారు.

హిందూ అభ్యర్థిని...

హిందూ అభ్యర్థిని...

గ్రేటర్‌ ఎన్నికల్లో రీ పోలింగ్‌ జరిగిన ఏకైక డివిజన పురానాపూల్‌లో విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పురానాపూల్‌ డివిజనలో మజ్లిస్‌ తరఫున హిందూ అభ్యర్థిని పోటీకి దించామని చెప్పారు.

ముస్లిం అభ్యర్థిని ఓడించి..

ముస్లిం అభ్యర్థిని ఓడించి..

పురానా పూల్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీచేసిన ముస్లిం అభ్యర్థిపై తమ అభ్యర్థి విజయం సాధించడం అసలైన లౌకికవాదాన్ని నిరూపించినట్లైందని అసదుద్దీన

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు



విజేతలకు శుక్రవారం రాత్రి అసదుద్దీన శుభాకాంక్షలు తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల ఫలితాలతో మజ్లిస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

మజ్లీస్ సంబరాలు..

మజ్లీస్ సంబరాలు..



ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు, కార్యకర్తలు ఊరేగింపుగా దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని.. బాణసంచా కాల్చారు. యువకులు నృత్యాలు చేశారు.

విజేతలకు అభినందనలు..

విజేతలకు అభినందనలు..

పార్టీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన ఒవైసీ, అహ్మద్‌ పాషా ఖాద్రీ, మోజంఖాన్ తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.

మిత్రపక్షమే ప్రతిపక్షంగా..

మిత్రపక్షమే ప్రతిపక్షంగా..

తెరాసకు బల్దియాలో మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీయే ప్రతిపక్షం కానుంది. మిగతా పార్టీలో కార్పోరేటర్లు నామమాత్రం కానున్నారు.

English summary
Pictures: MIM safe in Old city of Hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X