హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలికపై తండ్రీ, ఆతని భార్య దాష్టీకం: నరకం చూపించారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కన్న కూతురి పట్ల ఓ తండ్రి అత్యంత కిరాకతకంగా వ్యవహరించాడు. కన్న తల్లి మరణించి దిక్కులేని బాలికకు కన్న తండ్రి, అతని రెండో భార్య నకరం చూపించారు. ఇంట్లో బంధించి చిత్రహింసలు పెట్టారు. మానసిక, శారీరక వేధింపులకు పాల్పడ్డారు.

ప్రతిరోజూ నిత్యకృత్యంగా మారిన ఈ హింసను ఆ అమ్మాయి ఏడుస్తూ భరించింది. చివరికి జబ్బు పడింది. కానీ వారు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లని స్థితిలో ఆమె బాధను చూసి చలించిన స్థానికులు బాలల హక్కుల కమిషన్‌కు సమాచారం అందించారు. దీంతో పోలీసుల సహకారంతో వారు ఆ అమ్మాయికి విముక్తి కల్పించారు.

ఈ హృదయ విదారక సంఘటన హైదరాబాద్‍లోని ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న బాలల హక్కుల కమిషనర్ అచ్యుతరావు, ఎల్బీనగర్ పోలీసుల సహకారంతో బుధవారం రమేష్‌కుమార్ ఇంటికి చేరుకుని బాధితురాలు ప్రత్యూషను కలిశారు. ఆమెను వెంటనే ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించగా వివరాలను వెల్లడించింది.

కన్నీరు మున్నీరవుతూ..

కన్నీరు మున్నీరవుతూ..

సవతి తల్లి, తండ్రి కలిసి తనను చిత్రహింసలకు గురిచేసిన తీరును బాధితురాలు ప్రత్యూష పోలీసుల సమక్షంలో కన్నీరు పెడుతూ తెలిపింది.

తండ్రి అధికారి, అయినా..

తండ్రి అధికారి, అయినా..

ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ, ఆనంద్‌నగర్‌కు చెందిన సీహెచ్ రమేష్‌కుమార్ (52) కొత్తపేటలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో జూనియర్ టెలికాం అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు.

తండ్రి విడాకులు, తల్లి మృతి

తండ్రి విడాకులు, తల్లి మృతి

రమేష్ కుమార్‌కు 1991లో సరళాదేవితో వివాహం జరిగింది. వీరికి కూతురు ప్రత్యూష జన్మించింది. అయితే 2003లో సరళాదేవికి రమేష్‌కుమార్ విడాకులిచ్చాడు. దీంతో ఆమె వేరుగా నివాసముంటూ 2008లో అనారోగ్యంతో మృతిచెందింది.

తండ్రి రెండో పెళ్లి ఇలా..

తండ్రి రెండో పెళ్లి ఇలా..

2008లోనే రమేష్‌కుమార్ చాముండేశ్వరి అలియాస్ శ్యామలను రెండో పెండ్లి చేసుకున్నాడు. 2010లో కూతురు ప్రత్యూషను ముసాపేటలోని ఓ అనాథాశ్రమంలో చేర్పించారు.

అనాథాశ్రమం నుంచి ఇంటికి..

అనాథాశ్రమం నుంచి ఇంటికి..

రెండున్నరేండ్ల క్రితం ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. అప్పటి నుంచి ప్రత్యూష.. తండ్రి, సవతితల్లి వద్దే ఉంటుండగా.. గత కొంత కాలంగా ఇద్దరూ కలిసి ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టారు.

ప్రత్యూష్ ఒంటిపై గాట్లు..

ప్రత్యూష్ ఒంటిపై గాట్లు..

ప్రత్యూష (19) ఒంటిపై కత్తితో కోసి గాట్లు చేశారు. హార్పిక్, పినాయిల్ తాగించారు. ఒంటిపై వాతలు పెట్టారు. క్రూరమైన వీరి చర్యలు చివరికి బాలల హక్కుల కమిషన్ జోక్యంతో వెలుగులోకి వచ్చాయి.

ఆస్తి కోసమే వేధింపులు..

ఆస్తి కోసమే వేధింపులు..

ఆస్తి కోసమే తండ్రి రమేష్ కుమార్, తల్లి శ్యామల 19 ఏళ్ల ప్రత్యూషను చిత్రహింసలు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.

క్రమంగా చంపేందుకే...

క్రమంగా చంపేందుకే...

ప్రత్యూషను చిత్రహింసల ద్వారా చంపేసి ఆస్తిని కాజేయాలని తండ్రి రమేష్ కుమార్, సవతి తల్లి శ్యామల కుట్ర చేసినట్లు అనుమానిస్తున్నారు.

వారిద్దరి అరెస్టు...

వారిద్దరి అరెస్టు...

పోలీసులు రమేష్ కుమార్‌ను, ఆయన రెండో భార్య చాముండేశ్వరి అలియాస్ శ్యామలను అరెస్టు చేశారు.

స్టోర్ రూంలో నిర్బంధం

స్టోర్ రూంలో నిర్బంధం

బాలికను ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఆనందనగర్‌లోని ఇంటి స్టోర్ రూంలో నిర్బంధించారు. బాలిక కేకలు ఇరుగుపొరుగువారిని తీవ్ర కలవరానికి గురి చేశాయి.

English summary
A 19-year-old girl, who was brutally tortured by her father and stepmother for property, was rescued on Wednesday by officials of the State Commission for the Protection of Child Rights and the LB Nagar police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X