వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ రెడ్డిపై రివర్స్ అటాక్: ఒక్క సీటు మీద గారడీయా? (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చావు దెబ్బ తినడంతో ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై రివర్స్ అటాక్ ప్రారంభమైంది. సవాల్ చేసి ఫలితాల తర్వాత వెనక్కి తగ్గారనే విమర్శను ఆయన ఎదుర్కుంటున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని, లేదంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఇందుకు మీరు సిద్ధమేనా అని తెలంగాణ మంత్రి కెటి రామారావు విసిరిన సవాల్‌ను తాను అంగీకరిస్తున్నానని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు.

అయితే, తాను సవాల్ చేయలేదని, సవాల్ చేసింది కెటిఆర్ మాత్రమేనని, ఆ తర్వాత కెటిఆర్ సవాల్‌ను వెనక్కి తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. పైగా, ఏదైనా అడగదలుచుకుంటే కెటిఆర్‌నే అడగాలని ఆయన అన్నారు.

నేను స్పందించలేదు..

నేను స్పందించలేదు..

కేటీఆర్ చేసిన సవాలుకు కట్టుబడి పదవికి రాజీనామా చేస్తారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని మీడియా ప్రశ్నిస్తే తాను కేటీఆర్ సవాలుకు స్పందించలేదని అన్నారు.

దాటవేత వైఖరి అంటూ

దాటవేత వైఖరి అంటూ

రేవంత్ రెడ్డి మీడియా ప్రతిధులకు సరైన సమాధానం చెప్పలేక దాటవేతధోరణిని అవలంబించారని విమర్శలు వస్తున్నాయి.

ఇలా దాటవేత..

ఇలా దాటవేత..

తెరాసకు వంద స్థానాలు వస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పానని, సాధించకపోతే కెటిఆర్ తన మాటకు కట్టుబడి ఉంటారా అని తాను అప్పుడే చెప్పినట్లు రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, కెటిఆర్ మాట మార్చారని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి ఇలా..

రేవంత్ రెడ్డి ఇలా..

గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. మొత్తం మీద, గ్రేటర్ ఫలితాలతో రేవంత్ రెడ్డి కాస్తా ఇబ్బందికి గురైనట్లే కనిపించారు.

ఎన్నికల్లో నగర ప్రజలకు ఇచ్చిన హామీలను టీఆర్‌ఎస్ నెరవేర్చాలని రేవంత్ రెడ్డి అన్నారు.

English summary
Reverse attack has been started on Telugu Desamp Party (TDP) Telangana leader Revanth Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X