కెసిఆర్ ఎఫెక్ట్: ఆస్పత్రి చెత్తను ఎత్తేశారు (ఫొటోలు)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు సందర్శన ప్రభావం హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రిలో కనిపించింది. తూర్పు మండలం పోలీసు పారిశుద్ధ్య బాట శీర్షికన స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ఆదివారం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో జరిగింది.

శనివారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఫీవర్ ఆస్పత్రిలో ఆకస్మిక తనీఖీల్లో భాగంగా అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేసి, స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ద్వారా ఆస్పత్రిని శుభ్రపరచాలని అనడంతో స్పందించిన ఈస్ట్‌జోన్ డిసిపి రవీందర్ చేపడతామని చెప్పారు.

అయితే స్వచ్ఛ్భారత్ కార్యక్రమానికి రంగం సిద్ధం చేసినప్పటికీ ఆదివారం తెల్లవారు జామునుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో వర్షం తగ్గు ముఖం పట్టిన తర్వాత ప్రారంభించారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

హైదరాబాదులోని ఫీవర్ ఆస్పత్రి 6వ వార్డు డిప్తీరియా సమీపంలోని ఖాళీప్రదేశంలోని చెత్తాచెదారాన్ని జిల్లా కలెక్టర్ నిర్మల, ఆర్డీఓ నిఖిల, హిమాయత్‌నగర్ తహశీల్‌దార్ సుగుణ, డిసిపి రవీంద్ర కలసి లారీల ద్వారా తరలించారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

గ్రేటర్ హైదరాబాదులోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ నిర్మలతో పాటు తదితరులు చెప్పారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ద్వారా ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని వారన్నారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

పోలీసులు స్వచ్ఛ్భారత్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో బాధ్యత పెంపొందించడానికి దోహదపడుతుందని ఈస్ట్ జోన్ డిసిపి రవీందర్ అన్నారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

అన్ని శాఖల అధికారుల సమన్వయంతో వ్యవహరించి స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలు నిర్వహించాలని రవీందర్ సూచించారు. తద్వారా ఆరోగ్యపరమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

సామాజిక బాధ్యతగా పరిశుభ్రత కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి కార్యక్రమాలతో ఎంతోమందికి వారు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని రవీందర్ తెలిపారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కాచిగూడ, సుల్తాన్ బజార్, మలక్‌పేట, సబ్‌డివిజన్ ఏసిపిలు లక్ష్మీనారాయణ, గిరిధర్, కాచిగూడ సిఐ డి.రాజకుమార్, ఎస్సైలు చిరంజీవి, సైదా పాల్గొన్నారు.

ఫీవర్ ఆస్పత్రిలో...

ఫీవర్ ఆస్పత్రిలో...

ఫీవర్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డా.రాజారావు, ఆర్‌ఎంవో డా.టి.చిత్రలేఖ, ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ సోమశేఖర్, జిహెచ్‌ఎంసి ఎఎంహెచ్‌వో డా.రామారావు, ఆస్పత్రి డాక్టర్లు సులీలా, బాలప్రసూన, శ్రీకాంత్ భట్ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫీవర్ ఆస్పత్రిలో..

ఫీవర్ ఆస్పత్రిలో..

వర్షాభావంతో ఆస్పత్రి పూర్తిగా శుభ్రపరచడం పూర్తి కానందున సోమవారం కూడా స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని కొనసాగించనున్నట్టు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+