గోడ కూలి బలైన చిన్నారులు వీరే (ఫొటోలు)
హైదరాబాద్: రెండు గదుల మధ్య నిర్మించిన గోడ కూలటంతో ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన బోరబండలోని దేవయ్యనగర్‌లో చోటుచేసుకుంది.
సోమవారం అర్థరాత్రి గాఢ నిద్రలో ఉన్న చిన్నారులపై ఇంటి గోడ కూలటంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
సంజీవరెడ్డినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బోరబండ మూడో నెంబర్ సైట్‌లోని దేవయ్యనగర్‌లో కర్నూలు జిల్లాకు చెందిన చింతకుంట రాజు జిహెఎంసిలో కాంట్రాక్టు ప్రాతిపదికన స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. రాజుకు నవ్య(3), ఒకటిన్నర సంవత్సరాల వయస్సు గల సాయి చరణ్ అనే కుమారుడున్నారు. గతంలో మాదాపూర్‌లో నివాసం ఉండే రాజు కుటుంబం ఆదివారమే దేవయ్యనగర్‌లోని కనకయ్య ఇంట్లోకి అద్దెకు దిగారు. ఇళ్లు మారిన రెండో తమ ఇద్దరు పిల్లలు మృత్యువు బారిన పడటంతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.

చిన్నారులు మృతి
ప్రతిరోజు మాదిరిగానే సోమవారం రాత్రి సుమారు పది గంటల వరకు ఇరుగుపొరుగు చిన్నారులతో ఆడుకున్న నవ్య, సాయిచరణ్‌లు పదిన్నర గంటల సమయంలో నిద్ర పోయారు. రెండు గదులకు మధ్య నిర్మించిన గోడ అర్థరాత్రి పెద్ద శబ్ధంతో ఒక్కసారిగా వారిపై కూలింది.

చిన్నారుల మృతి
గోడ కూలడంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, స్థానికులు శిథిలాల నుంచి చిన్నారులను బయటకు తీయగా, వారు తీవ్ర గాయాలపాలై ఉన్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు.

చిన్నారుల మృతి
గోడ కూలిన ఘటనలో తల్లిదండ్రులకు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డినగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

చిన్నారులు మృతి
ఇద్దరు పిల్లలు మృత్యువు బారిన పడటంతో ఆ కుటుంబంలో పెను విషాదం చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications