జనారణ్యంలోకి అడవి పంది: ఇలా పట్టుకున్నారు (పిక్చర్స్)

హైదరాబాద్: ఓ ఆడవి పంది జనారణ్యలోకి వచ్చి సంచలనం సృష్టించింది. హైదరాబాదులోని వనస్థలిపురం హరిణవనస్థలి అటవీ ప్రాంతం నుంచి శుక్రవారం మధ్యాహ్నం బయటకు వచ్చిన అడవి పంది రెండు గంటలపాటు స్థానికులను ఉరుకులు, పరుగులు పెట్టించింది.

ఆటోనగర్ మీదుగా హుడా సాయినగర్ గుండా వనస్థలిపురం రైతుబజార్ సమీపంలో ఉన్న నెహ్రూపార్కులోకి ప్రవేశించింది. ఫారెస్ట్ రేంజ్ అధికారి మల్లికార్జున్ నాయక్ ఆధ్వర్యంలో అటవీ శాఖ సిబ్బంది రాకతో చివరికి ఉచ్చుల సహాయంతో పట్టుకున్నారు.

తర్వాత హరిణ వనస్థలిలో వదిలేశారు. ఇదిలా ఉండగా అడవి పంది దానంతట అదే వచ్చిందా, ఎవరైనా వేటాడి తీసుకువచ్చారా?అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హరిణ వనస్థలి ప్రాంతంలో అడవి పందుల వేట కొంత కాలంగా నడుస్తుందన్న ప్రచారం ఉంది. దీంతో అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

జనారణ్యంలోకి అడవి పంది

జనారణ్యంలోకి అడవి పంది

అడవి పంది ఓ పార్కులోకి చొరబడగా స్థానికులు, అటవీశాఖ అధికారులు రెండున్నర గంటలు శ్రమించి పట్టుకున్నారు.

జనారణ్యంలోకి అడవి పంది

జనారణ్యంలోకి అడవి పంది

వనస్థలిపురం రైతుబజారు నుంచి సాహెబ్‌నగర్‌కు వెళ్లే రహదారిలో ఉన్న సచివాలయనగర్‌ హుడా పార్కులో శుక్రవారం ఉదయం అడవి పంది చొరబడింది.

జనారణ్యంలోకి అడవి పంది

జనారణ్యంలోకి అడవి పంది

పందులను పట్టుకునే వారు పట్టుకోవడానికి వెంబడించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని అది గాయపరిచింది.

 జనారణ్యంలోకి అడవి పంది

జనారణ్యంలోకి అడవి పంది

స్థానికులు 108కి సమాచారం అందించడంతో అతని ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖ సిబ్బంది స్థానికులతో కలిసి పందిని పట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+