హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత హైదరాబాద్ ఆస్తులేవో చెప్పండి: హైకోర్టులో పిల్ దాఖలు

హైదరాబాదులో జయలలితకు ఉన్న ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం ఓ న్యాయవాది హైకోర్టుల పిల్ దాఖలు చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాదులో జయలలితకు ఉన్న ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం ఓ న్యాయవాది హైకోర్టుల పిల్ దాఖలు చేశారు.

హైదరాబాద్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత హైదరాబాదు ఆస్తులపై ప్రభుత్వం ప్రకటన చేసేలా చూడాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. జయలలితకు హైదరాబాదులో ఆస్తులున్న విషయం తెలిసిందే.

PIL filed on Jayalaithaa's assets in High Court

ఇటీవల మరణించిన తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత గత మే నెలలో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల సమయంలో తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులను ప్రకటించారని , అందులో కొన్ని ఆస్తులు హైదరాబాద్‌లోనూ ఉన్నట్టు పేర్కొన్నారని గరీబ్ గైడ్ ఎన్జీవో ప్రతినిధి భార్గవి పేర్కొంటూ ఆ పిల్ దాఖలు చేశారు.

జయలలిత ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదని ఆమె గుర్తు చేశారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జయలలిత ఆస్తులు 113.73 కోట్లు ఉన్నాయని, వాటిలో మేడ్చల్ గ్రామంలో 14 ఎకరాలు భూమి ఉందని, అలాగే శ్రీనగర్ ఏరియాలో కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఉన్నట్టు పేర్కొన్నారని, ఆమెకు భర్త లేదా పిల్లలు లేరని పిటిషనర్ అఫిడవిట్‌లో వివరించారు.

అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటూ సంతోష్‌కుమార్ ఒక పిల్ దాఖలు చేశారు. హెచ్‌బి కాలనీలో ఇళ్లు వాణిజ్య సముదాయాలుగా మారుతున్నాయని, నాలుగు అంతస్తులు నిర్మించి పెంట్ హౌస్‌లు వేస్తున్నా పట్టించుకోవడం లేదని తన పిల్‌లో పేర్కొన్నారు.

English summary
Bhargavi has filed PIL in High Court on Tamil Nadu ex CM Jayalalithaa's Hyderabad assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X