వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తమ్‌కు జానా షాక్: సర్కార్‌పై అవిశ్వాసం పెడతామనలేదు, స్పీకర్‌పై నిబంధనల అడ్డంకి

టిఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని తాను ఎప్పుడు చెప్పలేదని సిఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించిన వారినే ఆ విషయం అడగాలని జానారెడ్డి సంచలన కామెంట్లు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్: టిఆర్ఎస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని తాను ఎప్పుడు చెప్పలేదని సిఎల్పీ నేత జానారెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని ప్రకటించిన వారినే ఆ విషయం అడగాలని జానారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. అయితే కెసిఆర్ ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెడతామని ప్రకటించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి జానారెడ్డి ప్రకటన షాకిచ్చింది.

ప్రభుత్వంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ రెఢీ: బిజెపి నేతలతో జానారెడ్డి మంతనాలుప్రభుత్వంపై అవిశ్వాసానికి కాంగ్రెస్ రెఢీ: బిజెపి నేతలతో జానారెడ్డి మంతనాలు

శుక్రవారం నాడు అసెంబ్లీలో సీఎల్పీ నేత జానారెడ్డి చిట్ చాట్ చేశారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదు. ప్రభుత్వం తమకు నచ్చిన అంశాలనే తీసుకొస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ, ఇళ్ల నిర్మాణంపై చర్చకు వెనకాడుతోంది. అని జానారెడ్డి అభిప్రాయపడ్డారు.

టిటిడిపి దారెటు: వెల్‌కం ఖాయమేనా, పొత్తులపై బాబు వ్యూహత్మక మౌనం?టిటిడిపి దారెటు: వెల్‌కం ఖాయమేనా, పొత్తులపై బాబు వ్యూహత్మక మౌనం?

ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహలు చేస్తోందని సాగుతున్న ప్రచారం సాగుతోంది. స్పీకర్‌పై కాకుండా ప్రభుత్వంపైనే అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాలని ఆ పార్టీ యోచిస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇదే విషయమై జానారెడ్డి బిజెపి నేతలతో కూడ మాట్లాడారని అంటున్నారు.

అయితే ప్రభుత్వంపై అవిశ్వాసం పెడతామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీ మీడియా పాయిం‌ట్‌లో ప్రకటించారు.

అవిశ్వాసం పెడతామని చెప్పలేదు

అవిశ్వాసం పెడతామని చెప్పలేదు

రాష్ట్ర ప్రభుత్వం పెడతామని తాను ఎప్పుడూ చెప్పలేదని సిఎల్పీ నేత జానారెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో రెండు రోజుల క్రితం పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.అయితే దానికి భిన్నంగా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం పెడతామని తాను ఎప్పుడు చెప్పలేదని జానారెడ్డి ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది.

 ఉత్తమ్‌కు జానా షాక్

ఉత్తమ్‌కు జానా షాక్

ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెడతామని రెండు రోజుల క్రితం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.అయితే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెడతానని ఎవరో చెప్పారో దాని గురించి వారినే అడగాలని జానారెడ్డి ప్రకటించడం షాకిచ్చింది. పార్టీ నేతల మధ్య సమన్వయం లేనట్టుగా ఈ ప్రకటనలు కన్పిస్తున్నాయి. ఇద్దరు నేతల మధ్య సమన్వయం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 స్పీకర్‌పై అవిశ్వాసం చర్చకు రావాలంటే

స్పీకర్‌పై అవిశ్వాసం చర్చకు రావాలంటే

ప్రభుత్వంపైన అయినా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చుగానీ.. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం మాత్రం దాదాపు అసాధ్యమనే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇది. లోక్‌సభ పాటించిన ఒక నియమాన్ని ఉమ్మడి ఏపీ అనుసరించింది. కానీ,, రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ప్రస్తుతం ఇదే నియమాన్ని అనుసరిస్తున్నాయి.స్పీకర్‌పై అవిశ్వాసం చర్చకు రావాలంటే 50 మంది సభ్యుల మద్దతు కావాల్సిందే. దీంతో స్పీకర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ రెండు మూడు రోజులుగా సభలోనూ, బయట తమ నిరసనను వ్యక్తం చేస్తోంది. ఈ తరుణంలో అవిశ్వాస అంశం తెరమీదికి వచ్చింది.

 ప్రభుత్వంపై అవిశ్వాసానికి ఇబ్బందుల్లేవు

ప్రభుత్వంపై అవిశ్వాసానికి ఇబ్బందుల్లేవు

ప్రభుత్వంపై సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చర్చకు రావడానికి పదో వంతు సభ్యుల మద్దతు.. అంటే తెలంగాణలో 12, ఏపీలో 18 మంది సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది.అవిశ్వాసానికి సంబంధించి నియమనిబంధనలను ఆమోదించిన సమయంలో వాటి ఆచరణలోని లోతుపాతులు చూడకపోవడం వల్లే ఇప్పుడు ఇటువంటి సమస్యలు నెలకొన్నాయి.

రుణమాఫీపై చర్చకు సర్కార్ వెనుకడుగు

రుణమాఫీపై చర్చకు సర్కార్ వెనుకడుగు

రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉద్యోగాల భర్తీ, ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం చర్చకు వెనకాడుతోందని జానారెడ్డి తెలిపారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈనాటి సమావేశాల్లో కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటు, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఇంటర్ విద్య, వ్యవసాయం, కొత్త రహదారులు, నకిలీ విత్తనాలు తదితర అంశాలపై మంత్రులు సమాధానాలు ఇచ్చారు. కేసీఆర్ కిట్లపై కూడా చర్చ జరిగింది.

English summary
CLP leader Jana Reddy said that I never said move no confidece motion on TRS governament.Janareddy chit chat with media on Friday at assembly.please ask him who said on no confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X