ఒకే వేదికపై మోడీ-కేసీఆర్: ఫోకస్ అంతా వారిద్దరి వైపే
హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేపట్టిన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 2 తేదిన ప్రారంభమైంది. 14వ తేదీ వరకు జరగనున్నాయి. 13 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహంలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1,035 కుండాలతో శ్రీలక్ష్మీనారాయణ యాగాన్ని నిర్వహిస్తోన్నారు.
Recommended Video
వైభవంగా సహస్రాబ్ది ఉత్సవాలు..
సహస్రాబ్ది సమారోహం వేడుకలో రెండో రోజు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముచ్చింతల్ చినజీయర్ స్వామి ఆశ్రమానికి వచ్చిన ఆయనను వేదపండితులు ఘనస్వాగతం పలికారు. అనంతరం 216 అడుగుల శ్రీరామానుజులవారి విగ్రహాన్ని సందర్శించారు. ఆయన వెంట చినజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. రెండ్రోజులుగా నిర్వహిస్తున్న సహస్రాబ్ది సమారోహం వేడుకకు కేసీఆర్ హాజరయ్యారు.

మధ్యాహ్నం హైదరాబాద్‌కు..
కాగా- రామానుజాచార్యులవారి విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యఅతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. కేసీఆర్‌తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మోడీ హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. మధ్యాహ్నం 2:10 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరకుంటారు. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఆయనకు స్వాగతం పలుకుతారు.

ఇక్రిశాట్..ముచ్చింతల్
అనంతరం మోడీ పఠాన్‌చెరులోని ఇక్రిశాట్‌ను సందర్శిస్తారు. ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం ముచ్చింతల్ చినజీయర్ స్వామివారి ఆశ్రమానికి చేరుకుంటారు. సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. స్టాట్యూ ఆఫ్ ఈక్విటీ విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు. వేద గ్రంధాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ వేద గ్రంధాలయం డిజిటల్ రూపంలో ఏర్పాటు చేశారు. విగ్రహం ఎత్తు 216 అడుగులు కాగా.. 54 అడుగుల ఎత్తు ఉన్న పీఠంపై ఆశీనులైన స్థితిలో రూపొందించిన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

రాజకీయ ప్రాధాన్యత..
ఈ 54 అడుగుల ఎత్తున నిర్మించిన భవనంలో ఈ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఆయా కార్యక్రమాల సందర్భంగా మోడీ-కేసీఆర్ ఒకే వేదికను పంచుకోబోతోండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి గట్టడానికి కేసీఆర్ పావులు కదుపుతున్నారనేది బహిరంగ రహస్యం. రెండు రోజుల కిందటే బడ్జెట్ సందర్భంగా కూడా ఆయన మోడీపై నిప్పులు చెరిగారు. ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు.

మోడీ ప్రభుత్వంపై మాటల యుద్ధం..
మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను తప్పు పట్టారు. ఎన్డీఏ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందంటూ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా త్వరలోనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను కలుసుకోబోతున్నానని అన్నారు. మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఘాటు విమర్శల వేడి ఇంకా చల్లారలేదు. దీనిపై భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఇప్పటికీ ఆయనపై మాటలదాడి చేస్తూనే ఉన్నారు.

ఒకే వేదికపై..
ఈ పరిణామాల మధ్య మోడీ హైదరాబాద్‌కు రాబోతోండటం, ఆయనతో కేసీఆర్ వేదికను పంచుకోబోతోండటం ఆసక్తికరంగా మారింది. రాజకీయాలకు అతీతంగా త్రిదండి చినజీయర్ స్వామి నిర్వహిస్తోన్నందున ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. ఇక్కడ రాజకీయాలు, ఆ తరహా ఉపన్యాసాలకు ఏ మాత్రం అవకాశం లేదు. ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని హాజరైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయినప్పటికీ- మోడీపై కేసీఆర్ ఓ మినీ యుద్ధాన్నే ప్రకటించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే వేదికపైకి రాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications