పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు.. ఇక మీరూ: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా ఒక్కటంటూ మోడీ సెటైర్లు

హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని.. తొలిసారి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీజేపీ బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొని ప్రసంగించారు ప్రధాని మోడీ. ఈ సభలో బీజేపీ ముఖ్య నేతలతోపాటు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. నా కుటుంబసభ్యులారా అంటూ తెలుగులో ప్రధాని మోడీ ప్రసంగం మొదలు పెట్టారు. యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి, సమ్మక్కసారక్కలను స్మరించుకున్నారు. 2013లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వచ్చానని.. ఆ తర్వాత దేశ ప్రధాని అయ్యానని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వాదంతో బీసీని అయిన తాను ప్రధాని అయినట్లు తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ నుంచి బీసీ సీఎం తెలంగాణకు అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

PM Modi hits out at KCR govt in hyderabad LB stadium public meeting

దళిత రాష్ట్రపతి, గిరిజన రాష్ట్రపతిని చేసింది బీజేపీనేనని అన్నారు ప్రధాని మోడీ. గతంలో కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినవారికి బీజేపీ అండగా ఉందన్నారు.కాంగ్రెస్, బీజేపీలపై మోడీ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేశాయని, కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఎన్నో సార్లు మద్దుతుగా నిలిచారన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మూడు సారూప్యతలున్నాయన్నారు. ఈ రెండు పార్టీలు కుటుంబపార్టీలని.. అవినీతిలో కూరుకుపోయిన పార్టీలని.. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే పార్టీలని ప్రధాని మోడీ విమర్శించారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు అధికారం కట్టబెడితే అవినీతి రాజ్యమేలుతుందన్నారు. బీఆర్ఎస్ నేతలు అహంకారంతో ఉన్నారని.. వారిని ఇంటికి పంపించాలన్నారు.

పవన్ మాతో ఉన్నారు : తమతో పవన్ కళ్యాణ్ ఉన్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చిరునవ్వు నవ్వారు. దీంతో బీజేపీ, జనసేన, మోడీ, పవన్ నినాదాలతో సభ దద్దరిల్లింది. తనతో పవన్ ఉన్నారని.. ప్రజలు ఉన్నారని మోడీ చెప్పారు. తెలంగాణలో బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.


ఐదేళ్లపాటు ఉచిత బియ్యం :పేదలకు ఐదేళ్లపాటు ఉచిత బియ్యం ఇస్తామన్నారు ప్రధాని మోడీ. తన నిర్ణయానికి మద్దతు పలుకుతూ మొబైల్ ఫోన్ల ఫ్లాష్ లైట్లు చూపాలని కోరడంతో.. సభకు హాజరైన జనం అలాగే చేశారు. ఉచిత రేషన్.. మోడీ ఇస్తున్న గ్యారంటీ అన్నారు. అవినీతికి పాల్పడినవారి నుంచి తిరిగి సొమ్మును వెనక్కి తీసుకొచ్చి ప్రజలకు పంచుతామన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+