హైదరాబాద్ చేరిన ప్రధాని : స్వాగత కార్యక్రమానికి కేసీఆర్ దూరం- అసలు కారణం అదేనా..!!
ప్రధాని మోదీ ఒక రోజు పర్యటనలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రధాని మోదీకి గవర్నర్ తమిల్ సై.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి...రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగత కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీని పైన చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని పైన కేసీఆర్ రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక దశలో ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటారనే ప్రచారం సాగింది.
Recommended Video
మంత్రి తలసానికి పీఎం స్వాగత బాధ్యతలు అప్పగించారని చెప్పుకొచ్చారు. అయితే, రాజకీయంగా ఎలా ఉన్నా..ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలకటం నుంచి వీడ్కోలు పలికే వరకూ మొత్తం పాల్గొంటారంటూ సీఎంఓ నుంచి సమాచారం ఇచ్చారు. అయితే, ఇప్పుడు ప్రధాని స్వాగత కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. ప్రధానిని స్వాగతించడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు కేసీఆర్ వెళుతున్నారని, మధ్యాహ్నం 2.10గంటలకు ఎయిర్‌పోర్టులో స్వాగతం చెప్పి, అక్కడి నుంచి ఇద్దరూ హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు వెళతారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అనంతరం, సాయంత్రం 4 గంటలకు ముచ్చింతల్‌కు వెళతారని, అక్కడ రామానుజుల విగ్రహావిష్కరణ కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 8.15 గంటల ప్రాంతంలో సీఎం కేసీఆర్ ప్రధానికి వీడ్కోలు పలుకుతారని వివరించాయి.

తాజాగా ఇప్పుడు జ్వరం కారణంగా మోదీకి కేసీఆర్ ఆహ్వానం పలికేందుకు వెళ్లలేదని సమాచారం. అయితే, సాయంత్రం రామానుజ విగ్రహావిష్కరణ కార్యక్రమం తెలంగాణలో జరుగుతున్న ప్రధాన ఘట్టం కావటంతో కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, జ్వరం కారణంగా సీఎం స్వాగత కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం అందుతున్నా.. రాజకీయంగా ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది.












Click it and Unblock the Notifications