ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం స్వర్వేద మహా మందిర్ ప్రారంభించిన పీఎం మోడీ!!
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ గా ఈ ఖ్యాతికెక్కింది. 20 వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఏడు అంతస్తులలో స్వర్వేద మహా ధ్యాన మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ప్రారంభించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల ఉత్తర ప్రదేశ్ పర్యటనలో భాగంగా వారణాసిలో ఉమారహలో నిర్మించిన స్వర్వేద మహా మందిర్, ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని నేడు ప్రారంభించారు. ఈ జన్మ మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాశీలో గడిపిన ప్రతిక్షణం మరిచిపోలేనిదని మోడీ వెల్లడించారు. కాశి అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

స్వర్వేద మహా ధ్యాన మందిర్ విశేషాలను మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహారాజ్, విజ్ఞానంద్ దేవ్ మహారాజ్ ప్రధాని నరేంద్ర మోడీకి తెలియజేశారు. రామాయణ మహాభారత కావ్యాలను ప్రదర్శన చేసేలా కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిచ్చే విధంగా దీనిని అత్యంత అద్భుతంగా రూపొందించారు.
#WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi
— ANI (@ANI) December 18, 2023
Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1
భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటనలో భాగంగా వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన 20 వేల కోట్ల రూపాయల విలువైన 37 అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రధానమంత్రి నియోజకవర్గ పరిధిలో గల సేవాపురిలో నిర్వహించే వికసిత్ భారత సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.
కాశీ సంసాద్ ఖేల్ ప్రతి యోగిత 2023 క్రీడల్ని కూడా ప్రధానమంత్రి తిలకించి విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు . అనంతరం 10 వేల 9 వందల కోట్ల రూపాయలతో నిర్మించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్ న్యూ బౌపూర్ మధ్య నిర్మించిన ఫ్రైట్ కారిడార్ ను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications