Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రామగుండంలో 91 ఎఫ్ఎం ప్రారంభించిన మోడీ: తెలుగు రాష్ట్రాల్లో ‘మన్ కీ బాత్’ ఇక్కడే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త ఎఫ్ఎం స్టేషన్ ప్రారంభమైంది. పెద్దపల్లి జిల్లా రామగుండంతోపాటు దేశంలోని 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 100 వాట్స్ సామర్థ్యం కలిగిన 91ఎఫ్(91FM) ట్రాన్స్‌మీటర్లను ప్రధాన నరేంద్ర మోడీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. వినోదం, క్రీడలు, వాతావరణానికి సంబంధించిన సామాచారాన్ని స్థానిక ప్రజలకు చేరవేయడంలో ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

85 జిల్లాల్లో 100 వాట్ల 91 ఎఫ్ఎం ట్రాన్స్‌మీటర్లను ఇన్‌స్టాల్ చేయడం జరిగిందని ప్రధాని తెలిపారు. త్వరలో తాను రేడియోలో 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌లో ప్రసంగిస్తానని మోడీ చెప్పారు. దేశ ప్రజలతో ఈ రకమైన భావోద్వేగ అనుబంధం రేడియో ద్వారా మాత్రమే సాధ్యమైందని చెప్పారు. కాగా, ఆల్ ఇండియా ఎఫ్ఎంకు చెందిన 91 ట్రాన్స్ మీటర్ల ప్రారంభం దేశంలోని 85 జిల్లాల్లోని 2 కోట్ల మంది ప్రజలకు బహుమతి లాంటిదని ప్రధాని మోడీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతోపాటు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

మరోవైపు, కాగజ్‌నగర్‌లో ఉన్న 'లో పవర్​ టీవీ ట్రాన్సీమీటర్'​ కేంద్రం నుంచి సేవలు పునః ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ వర్చువల్​గా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ రేడియో సేవలను సద్వినియోగించుకోవాలని ప్రధాని సూచించారు.

PM Modi inaugurates 91 FM transmitters across 18 States

ఈ కార్యక్రమం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో ప్రారంభం కానుందని ఆల్ ఇండియా రేడియో వెల్లడించింది. వాటిలో తెలంగాణలోని నల్గొండ జిల్లా దేవరకొండ, నల్గొండ టౌన్, పెద్దపల్లి జిల్లా రామగుండం, అసిఫాబాద్ జిల్లాసిర్పూర్ కాగజ్ నగర్ తోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఉన్నాయని వివరించింది.

కాగా, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లడఖ్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ఎఫ్ఎం ట్రాన్స్ మీటర్లను అమర్చినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+