తెలంగాణకు ప్రధాని మోడీ రాక: నిఘా నీడలో హైదరాబాద్, గజ్వెల్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. విభజన తర్వాత ఆయన మొదటిసారి తెలంగాణలో అడుగు పెడుతున్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
ప్రధాని కోమటిబండపై పైలాన్‌ను ఆవిష్కరించి, నల్లా ద్వారా నీరు వదిలిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమంపై రూపొందించిన త్రీడీ దృశ్యరూపకాన్ని సీఎం కేసీఆర్, మిషన్ భగీరథ పథకం వైస్‌ఛైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి ఆయనకు వివరిస్తారు.
దీంతో పాటు అక్కడే ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శననూ మోడీ తిరలించనున్నారు. ప్రధాన వేదికపై మొత్తం పద్దెనిమిది మంది కూర్చోనున్నారు. వేదికకు కుడివైపు ప్రజాప్రతినిధులు, ఎడమ వైపు కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆసీనులయ్యేందుకు మరో రెండు వేదికలు సిద్ధం చేశారు.
కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అనంత్ కుమార్, వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు, బండారు దత్తాత్రేయతో పాటు గవర్నర్ నరసింహన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోడీ కోసం కోమటిబండపై, ప్రధాన వేదిక వద్ద ప్రత్యేకంగా సూట్లను సిద్ధంగా ఉంచారు.
పాస్‌లు అందని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్తు ఛైర్మన్లకు సభా ప్రాంగణానికి చేరుకునే తొలి చెక్‌పోస్టు వద్దనే పాస్‌లు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయంలో అంబులెన్స్‌లు ప్రధాన వేదిక చుట్టూ తిరిగేలా రెండు మార్గాలను సిద్ధం చేశారు. దీనిలో ఒక మార్గాన్ని ప్రధాని కోసం కేటాయించారు.

మోడీకి స్వాగతం పలకనున్న కేసీఆర్, నరసింహన్
ప్రధాన మోడీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని మోడీకి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ ఘనస్వాగతం పలుకనున్నారు. ప్రధాన కార్యక్రమం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించే కోమటిబండ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ జరిగే బహిరంగ సభకు రెండు లక్షల మంది ప్రజలను సమీకరిస్తున్నారు.
వర్షం కురిసినా తడవని రెయిన్ ప్రూఫ్ టెంట్లు
వర్షం కురిసినా సభకు ఇబ్బంది లేకుండా ఉండేలా సభాస్థలిలో రెయిన్ ప్రూఫ్‌టెంట్లు వేయించారు. ప్రధాని మోడీ సభకు వచ్చే వాహనాల కోసం 170 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. సుమారు 200 తాత్కాలిక టాయిలెట్లు నిర్మించారు.
ప్రధానితో పాటు ఐదుగురు కేంద్రమంత్రులు కూడా వస్తున్నందున సభావేదిక ఆ మేరకు రూపొందించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్యులకు ఒక వేదిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాధికారులు తదితరులకోసం మరో వేదిక, రాష్ట్ర మంత్రులు, జెడ్పీచైర్మన్లు తదితర ప్రముఖులకు మూడో వేదిక ఏర్పాటు చేశారు.
ప్రధాని మోడీ మిషన్ భగీరథ మొదటి దశను ప్రారంభించిన అనంతరం బహిరంగ సభ వేదిక వద్దకు వస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి రామగుండంలోని 1600 మెగావాట్ల ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ, మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్‌లకు శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
వరంగల్‌లోని కాళొజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ ప్రారంభం, ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌లోని సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్కేంద్రం జాతికి అంకితం చేసే శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు.
కేంద్రమంత్రి దత్తాత్రేయ స్వాగతోపన్యాసం అనంతరం సీఎం కేసీఆర్, తర్వాత ప్రధాని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.20కి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్న ప్రధాని మోడీ కార్యక్రమం దాదాపు రెండు గంటలపాటు ఉంటుందు. 4.30కి గజ్వేల్ నుంచి హైదరాబాద్ చేరుకునే ఆయన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీజేపీకార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు.
ప్రధాని మోడీ పర్యటనకు భారీ భద్రత
ప్రదాని పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే హైదరాబాదులో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగర పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను రప్పించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సాయుధ బలగాలు మొత్తం 5వేల మంది పోలీసులను వినియోగిస్తున్నారు.
ఎల్పీ స్టేడియం వద్ద ఎస్పీజీ అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఇద్దరు డీఐజీ స్థాయి అధికారులను నియమించారు. బేగంపేట నుంచి ఎల్పీ స్టేడియం వరకు రూట్ బందోబస్తు అధికారులతో పాటు సీసీటీవీలను ఏర్పాటు చేశారు.
ప్రధాని బేగంపేట నుంచి ఎల్బీ స్టేడియానికి వెళ్లే వరకు, మళ్లీ అక్కడ నుంచి తిరిగి బేగంపేట చేరుకునే వరకు సీసీ కెమెరాల దృశ్యాలను చిత్రీకరించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు పంపుతాయి. బేగంపేట విమానాశ్రయం, ఎల్బీ స్టేడియం పరిసరాల్లో రెండు కిలోమీటర్ల వరకు పోలీసులు నిషేధ ఆజ్ఞలు విధించారు.
మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు అరగంట ముందు ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపేస్తారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 17 సంచార సీసీటీవీ నెట్ వర్క్ వాహనాలను అందుబాటులో ఉంచారు. ఎత్తైన భవనాలపై పోలీసులు కాపలా ఉన్నారు. గజ్వెల్లోను భారీ భద్రత ఏర్పాటు చేశారు.
-
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
జీవన్ రెడ్డి BRS లో చేరికపై తేల్చేసిన కేసీఆర్, వాట్ నెక్స్ట్..!! -
ఒరేయ్ ఆజామూ లగెత్తరోయ్.. తులం బంగారం రూ. 2 వేలే.. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..?












Click it and Unblock the Notifications