పీఎం మోడీకి గిన్నిస్ బుక్ లో చోటు కల్పించాలి, భారత రత్న ఇవ్వాలి .. మాజీ మంత్రి సంచలనం

ప్రధాని నరేంద్ర మోడీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నాయకుడు, మాజీ మంత్రి శంకర్ రావు . కరోనా వైరస్ విషయంలో వైద్యం పట్ల తనకున్న అవగాహనను, ఆలోచనలను చెప్తున్నానని పేర్కొన్న మాజీ మంత్రి శంకర్రావు ప్రధాని నరేంద్ర మోడీ కరోనా సమయంలో సమర్థవంతంగా పని చేశారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న పనుల వల్ల ఆయనకు భారతరత్న ఇవ్వాలని రాష్ట్రపతిని కోరుతున్నారని మాజీ మంత్రి శంకర్రావు పేర్కొన్నారు.

 దేశంలో మోడీ సంస్కరణలు గొప్పగా ఉన్నాయన్న మాజీ మంత్రి శంకర్ రావు

దేశంలో మోడీ సంస్కరణలు గొప్పగా ఉన్నాయన్న మాజీ మంత్రి శంకర్ రావు

దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని చెప్పిన మాజీ మంత్రి మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ఆరున్నర సంవత్సరాలు ప్రధానిగా మోడీ దేశానికి ఎనలేని సేవ చేశారు అంటూ కొనియాడారు. దేశమంతా ఒకే జీఎస్టీ విధానం, స్వచ్ఛభారత్, ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లు ప్రధాని నరేంద్ర మోడీకి మంచి పేరు తీసుకొచ్చాయి అని మంత్రి శంకర్ రావు అభిప్రాయపడ్డారు.

ఇక కరోనా మహమ్మారి విషయానికి వస్తే కరోనా కంట్రోల్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ అద్భుతంగా పని చేశారన్నారు.

దేశంలో కరోనా కంట్రోల్ లోకి రావటానికి మోడీ విధానాలే కారణం

దేశంలో కరోనా కంట్రోల్ లోకి రావటానికి మోడీ విధానాలే కారణం

దేశంలోని 27 రాష్ట్రాలలో కరోనా ప్రభావం తగ్గిందని పేర్కొన్నారు. 60 ఏళ్లు దాటిన వారికే 53% కరోనా సోకిందని లెక్కలు చెప్పారు. ఇప్పటివరకు 90 లక్షల మందికి పైగా కరోనా నుండి కోలుకున్నారని, ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టిందని, అందుకు ప్రధాన మోడీ నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు విధానాలు కారణమని మాజీ మంత్రి శంకర్రావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పించాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మోడీ గురించి మాట్లాడినంత మాత్రాన బీజేపీలో చేరుతున్నట్టు కాదన్న శంకర్ రావు

మోడీ గురించి మాట్లాడినంత మాత్రాన బీజేపీలో చేరుతున్నట్టు కాదన్న శంకర్ రావు


ప్రధాని నరేంద్ర మోడీ చేసిన మంచి పనులు చెప్పినంత మాత్రాన తాను బీజేపీలోకి వెళ్తున్నట్లు కాదన్నారు మాజీ మంత్రి శంకర్రావు.

గత ఎన్నికల్లో షాద్ నగర్ నుండి కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా శంకర్ రావు ఎన్నికల బరిలోకి దిగారు. అంతకు ముందు 2014 లో కూడా టికెట్ ఇవ్వకపోవటంతో కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు . 2018లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు . అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్న శంకర్ రావు తాజాగా మోడీపై ప్రశంసల జల్లు కురిపించటం బీజేపీలో చేరుతున్నారా అన్న అనుమానాలకు కారణం అవుతుంది .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+