హైదరాబాద్‌లోనే ప్రధాని మోడీ: రాజ్‌భవన్‌లో బస, హైఅలర్ట్, 5న సంగారెడ్డి సభకు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ రెండో రోజుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఆదిలాబాద్‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. మంగళవారం రోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి పర్యటన నిమిత్తం, మోడీ సోమవారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డీజీపీ, సీఎస్ సాదర స్వాగతం పలికారు.
ప్రధాని మోడీ రాష్ట్రంలో రెండో రోజు పర్యాటనలో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9వేల 21కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోడీ ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుంచి బయలుదేరి 10.45 గంటలకు సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభాప్రాంగాణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జిల్లాలో రూ. 1,409 కోట్లతో నిర్మించిన ఎన్‌హెచ్-161 నాందేడ్ అఖోలా జాతీయ రహదారిని మోడీ జాతికి అంకితం చేయనున్నారు.

అదే విధంగా సంగారెడ్డి క్రాస్‌రోడ్డు నుంచి మదీనాగుడా వరకు1298 కోట్ల రూపాయలతో ఎన్‌హెచ్-65ని 6 లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో రూ. 399 కోట్లతో చేపడుతున్న ఎన్‌హెచ్-765D మెదక్-ఎల్లారెడ్డి జాతీయ రహదారి విస్తరణ, 500 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి-రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 12.30 గంటలకు సంగారెడ్డి నుంచి బయలుదేరి వెళ్తారు.
కాగా, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డిల రాకతో జిల్లాలోని పటాన్‌చెరు పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం 2వేల మంది పోలీసు బలగాలతో సభ ప్రాంగాణానికి మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని రాకతో భద్రత దృష్ట్యా సభస్థలానికి 5 కిలో మీటర్ల మేర "నో ఫ్లై జోన్" ఏర్పాటు చేశారు. డ్రోన్ ఎవరు ఎగురవేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు. మరోవైపు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని రెండు పార్లమెంట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బీజేపీ కార్యకర్తలు, మోడీ అభిమానులు సభప్రాంగాణానికి రావడానికి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications