వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ రామగుండం పర్యటన రగడ: వస్తే రణరంగమే.. అడ్డుకునేందుకు పక్కా వ్యూహంతో టీఆర్ఎస్!!

|
Google Oneindia TeluguNews

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి ప్రధాన నరేంద్ర మోడీ రామగుండం కి రానున్నారు. అయితే ప్రధానమంత్రి పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. ఒక టిఆర్ఎస్ పార్టీకి తోడుగా వామపక్షాల నాయకులు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోడీని అడ్డుకుని తీరుతామని తేల్చి చెబుతున్నాయి.

12న తెలంగాణాకు ప్రధాని మోడీ రాక.. రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం!!12న తెలంగాణాకు ప్రధాని మోడీ రాక.. రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం!!

ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ తో పాటు వామపక్షాల అభ్యంతరం

ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ తో పాటు వామపక్షాల అభ్యంతరం

ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండనునట్టు తెలుస్తుంది. ఇప్పటికే మూడు సార్లు మోడీ పర్యటనకు ఏ విధంగా అయితే సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారో, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రధాని మోడీ పర్యటన ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి టిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కర్మాగారాన్ని ఇప్పుడు ప్రధాని ప్రారంభించటం ఏమిటని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక వామపక్ష పార్టీల నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం లో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

 తెలంగాణాకు అన్యాయం చేస్తూ ఇక్కడకు రావటం దేనికి ?

తెలంగాణాకు అన్యాయం చేస్తూ ఇక్కడకు రావటం దేనికి ?


తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించి తమ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రయత్నం చేసిన బీజేపీ తీరుపై అసహనం వ్యక్తం చేయడంలో భాగంగా మోడీ పర్యటనను అడ్డుకుంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఏం చేశారో చెప్పాలన్నారు. రాష్ట్రానికి అడుగడుగున ద్రోహం చేస్తూ రాష్ట్రానికి అప్పులు కూడా పుట్టినివ్వకుండా ఆంక్షలు విధిస్తూ, వడ్ల కొనుగోలు లో దోబూచులాడుతూ ప్రధాని రాష్ట్రానికి వచ్చి ఏం చేయబోతున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగాల విషయంలో మోడీని టార్గెట్ చేస్తున్న విద్యార్ధి సంఘాలు

ఉద్యోగాల విషయంలో మోడీని టార్గెట్ చేస్తున్న విద్యార్ధి సంఘాలు


ఇక ఇదే సమయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ప్రధాని యువతను మోసం చేశారని విద్యార్థి సంఘాలు సైతం రంగంలోకి దిగుతున్నాయి. ఉద్యోగాల సంగతి తేల్చిన తరువాత ప్రధానమంత్రి ఇక్కడ అడుగు పెట్టాలని లేకపోతే అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి యువతకు తీరని అన్యాయం చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు వెల్లడించారు. ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని, కేంద్రంలో లక్షలాది ఉద్యోగాలు ఉన్నా వాటికి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేసిన వారు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాతే మోడీ తెలంగాణకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.

 ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చెయ్యటంపై వ్యతిరేఖత

ఎస్సీ వర్గీకరణ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చెయ్యటంపై వ్యతిరేఖత


ఎస్సీ వర్గీకరణ చేయకుండా తమను మోసగించిన ప్రధాని నరేంద్ర మోడీ రామగుండం కు వస్తే అక్కడ రణరంగంగా మారుతుందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. బిజెపి తమకు ఇచ్చిన హామీని విస్మరించిందని మోడీ రాకను వ్యతిరేకిస్తూ 12న రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటుపరం చేస్తున్న మోడీ రాకను వ్యతిరేకిస్తున్నట్టు కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు టిఆర్ఎస్కెవి, సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్టియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ప్రధాని పర్యటనను అన్ని వర్గాలతో కలిపి తీవ్రంగా ప్రతిఘటించేలా టిఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది.

English summary
PM Narendra Modi will come to Ramagundam to dedicate Ramagundam Fertilizers and Chemicals Limited to the nation on 12th November. The tussle over Modi's visit to Ramagundam continues. TRS has a strategy to prevent Modi's tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X