12న తెలంగాణాకు ప్రధాని మోడీ రాక.. రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం!!

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 12వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. నవంబర్ 12వ తేదీన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయడానికి ప్రధాన నరేంద్ర మోడీ రామగుండం కి రానున్నారు. అయితే ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది.

రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం చెయ్యనున్న దేశ ప్రధాని

రామగుండం ఆర్‌ఎఫ్సీఎల్‌ జాతికి అంకితం చెయ్యనున్న దేశ ప్రధాని


కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దక్షిణాది ప్రాంతంలో అతిపెద్ద ఎరువుల కర్మాగారం అయినా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీపీసీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇక అదే సమయంలో సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైను అధికారికంగా ప్రారంభిస్తారు. ఇక తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన 3 నేషనల్ హైవే ప్రాజెక్టులకు కూడా మోడీ రామగుండం వేదికగా శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తుంది.

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎరువుల శాఖ యూనియన్ కార్యదర్శి అరుణ్ సింఘాల్

ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎరువుల శాఖ యూనియన్ కార్యదర్శి అరుణ్ సింఘాల్

2021 మార్చి నెలలో వ్యాపారం ప్రారంభించిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ఎరువుల శాఖ యూనియన్ కార్యదర్శి అరుణ్ సింఘాల్ సన్నాహాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని మహాత్మాగాంధీ స్టేడియంను కూడా హెలిప్యాడ్‌తో సిద్ధం చేసినట్లు సమాచారం.

సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైను ప్రారంభించనున్న మోడీ

సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైను ప్రారంభించనున్న మోడీ

ఇక బొగ్గు రవాణాకు సంబంధించి సత్తుపల్లి కొత్తగూడెం రైల్వే లైను నిర్మించారు. సింగరేణి మరియు రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో 927.94 కోట్ల రూపాయల వ్యయంతో 54 కిలోమీటర్ల రైల్వే లైన్ ను నిర్మించారు. ఇక ఈ ప్రాజెక్టులో సింగరేణి 618 కోట్లు ఖర్చు చేయగా 109 కోట్లు ఖర్చు చేసింది. దీనిని కూడా ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై రైల్వే సీనియర్ డి ఆర్ ఎం రామగుండంలో సమీక్ష జరిపారు.

నేడు ప్రధాని పర్యటనపై ఉన్నతస్థాయి సమావేశం

నేడు ప్రధాని పర్యటనపై ఉన్నతస్థాయి సమావేశం


ఇదిలా ఉంటే తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రధాని పర్యటన పై, ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించి, ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్రారంభానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రధాని కార్యాలయం నుండి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని పేర్కొన్నారు. కాగా ప్రధాని పర్యటన ఏర్పాట్లను సమీక్షించడం కోసం శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+