ప్రధాని మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు: కీలక పరిణామాలతో ప్రాధాన్యత
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 8న వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.45 గంటలకు ప్రధాని మోడీ హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి 9.50 నిమిషాలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఆ తర్వాత 10.35 గంటలకు వరంగల్‌లోని హెలిప్యాడ్‌కు మోడీ చేరుకోనున్నారు. అక్కడ ప్రధాని మోడీకి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలకనున్నాయి.
జులై 8న 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు నరేంద్ర మోడీ హాజరై ప్రసంగించనున్నారు. ఆ సభ ముగించుకుని 12.15 గంటలకు వరంగల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు.

అక్కడ్నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. కాగా, ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం పార్టీ శ్రేణులు ఇప్పటి ఏర్పాట్లు ప్రారంభించాయి.
రెండు రోజుల క్రితం వరంగల్‌కు వెళ్లి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కాజేపేట వ్యాగన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. మోడీ పర్యటనలో భాగంగా వరంగల్‌లోని కాజీపేట వ్యాగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే దేశంలోని అతిపెద్ద వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన చేసి.. ఆ తర్వాత హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఇది ఇలావుండగా, తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు జరిగాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ఈటల రాజేందర్‌ను నియమించారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వరంగల్ సభకు ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications