Modi:తెలంగాణ నుంచి ప్రధాని పోటీ, నియోజకవర్గం ఫిక్స్ - రేవంత్, కేసీఆర్ కు చెక్..!!

PM Modi from Telangana:తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కొత్త లెక్కలు తెర మీదకు తెస్తున్నాయి. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ తమకు అనుకూల ఫలితాలు ఉంటాయని అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి పుంజుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ కేంద్రంగా కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్తోంది.

బీజేపీ బిగ్ స్కెచ్
తెలంగాణలో అసెంబ్లీ పోరు ముగిసింది. ఇక లోక్ సభ ఎన్నికల సమరం ఆరంభం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన సీట్లు..ఓట్లతో బీజేపీ కొత్త స్కెచ్ సిద్దం చేస్తోంది. 2019 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో నాలుగు సీట్లు గెలిచింది. కానీ, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలవటంతో తెలంగాణ పైన బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. అందులో భాగంగా తెలంగాణతో సహా దక్షిణాదిపైన ప్రభావం ఉండేలా కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. నేరుగా ప్రధాని మోదీని తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని కోరింది. నరేంద్ర మోదీ మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని..అందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం కుదిరిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

PM Modis Surprise Move: Contesting Malkajgiri Seat Shakes Up Telangana Politics

మల్కాజ్‌గిరి నుంచి ప్రధాని పోటీ
ప్రధాని మోదీ పోటీ చేయటం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దక్షిణాది పైన ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో తమిళనాడు నుంచి ప్రధాని పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రధాని మోదీ పలు మార్లు ప్రచారానికి వచ్చారు. దక్షిణాదిలో ఇప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేదు. దీంతో..తెలంగాణలో ప్రస్తుత సమీకరణాలు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు. మల్కాజ్ గిరి మినీ ఇండియాగా భావిస్తారు. అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ ఎంపీగా గెలుపొందారు.

రెండు పార్టీలకు చెక్
ప్రధాని మోదీ పోటీ చేస్తే బీఆర్ఎస్ నుంచి కొందరు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణలోఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు మినహాయిస్తే.. మిగతా 13 నియోజకవర్గాలపై బీజేపీ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్‌ను లేకుండా ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు బిగ్ స్కెచ్ తో బీజేపీ నేతలు అడుగులు వేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణలో పోటీ చేయటం ద్వారా అటు బీఆర్ఎస్ - ఇటు కాంగ్రెస్ కు చెక్ పెట్టాలనేది ఆ పార్టీ వ్యూహం. అందులో భాగంగా మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని ప్రధాని ముందు బీజేపీ నేతలు ప్రతిపాదించారు. దీని పైన త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+