వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీతోనే తెలంగాణ, మోడీ! మాకెంతో చేశారు: హిందీలో కేసీఆర్, వెంకయ్య వల్లే..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. ఆయన ప్రధాని అయ్యాక రావడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం గం.2.20 నిమిషాలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

PM Narendra modi arrives Hyderabad

హిందీలో ప్రసంగించిన కేసీఆర్

- భారత దేశంలోకి అత్యంత ప్రియమైన నాయకుడైన ప్రధాని మోడీకి తాను తెలంగాణ తరఫున స్వాగతం పలుకుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ హిందీలో మాట్లాడటం గమనార్హం. ప్రధాని మోడీకి అర్థమయ్యేందుకు కూడా ఆయన హిందీలో తన ప్రసంగాన్ని కొనసాగించారు.

తెలంగాణ ఏర్పడ్డాక: తెలుగులో మాట్లాడిన మోడీ, కేసీఆర్‌కు కితాబుతెలంగాణ ఏర్పడ్డాక: తెలుగులో మాట్లాడిన మోడీ, కేసీఆర్‌కు కితాబు

- మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఇంటింటికి నీరు అందిస్తామని చెప్పారు. మిషన్ భగీరథ ఓ బృహత్తర కార్యక్రమం అన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథతో 243 గ్రామాలకు నీటిని అందిస్తామన్నారు. కృష్ణా, గోదావరి జలాలను ఇంటింటికి చేర్చాలన్నదే తమ ప్రయత్నం అన్నారు.

మోడీజీ! మాకు ఎంతో చేశారు.. కేసీఆర్

- ప్రధాని మోడీ పాలన అవినీతిరహితంగా సాగుతోందని కేసీఆర్ ప్రశంసలు కురిపించారు. దేశంలో వంద శాతం అవినీతిరహిత పాలన సాగుతోందని, అది కేవలం మోడీ హయాంలోనే సాధ్యమవుతోందన్నారు. రైల్వే లైన్ కల ఇన్నాళ్లకు నెరవేరిందన్నారు. కొత్తపల్లి - మనోహరాబాద్ రైల్వే లైన్ ఉత్తర తెలంగాణ కల అన్నారు.

మోడీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. కేసీఆర్

- దేశంలో అవినీతిరహిత పాలన అందిస్తున్న ప్రధాని మోడీ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్నారు. రెండున్నరేళ్లలో భూతద్దం పెట్టి చూసినా కొంచెం కూడా అవినీతి కనిపించదన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు ఎంతో సహకారం అందుతోందన్నారు. కేంద్రమంత్రులు తమ రాష్ట్రానికి సహకరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనేక విషయాల్లో మద్దతు లభిస్తోందని, కేంద్రమంత్రుల చేయూత లభిస్తోందన్నారు.

వెంకయ్యకు కితాబు

- హడ్కో రుణం మంజూరు కావడంలో మన తెలుగువాడైన కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సహకరించారన్నారు. అందుకు ఆయనకు ధన్యవాదాలు అన్నారు. వెంకయ్య నాయుడు నుంచి తమకు ఇతోధిక సహకారం అందుతోందన్నారు.

- భారతీయ జనతా పార్టీ సహకారంతోనే నాడు తెలంగాణ సాకారమైందన్నారు. కొత్త రాష్ట్రానికి మీరు అందిస్తున్న ఆత్మీయ అనురాగాలు తమకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడిన ప్రజలు అధికంగా ఉన్న రాష్ట్రం అన్నారు. ప్రధానిగా మీ ప్రేమ, ఆశీర్వాదాలు అందించాలని కోరుతున్నానని చెప్పారు.

- ఎప్పుడూ లేనంతగా తెలంగాణలో రహదారుల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి జిల్లాకు వెనుకబడిన జిల్లా కింద రూ.50 కోట్ల అందిస్తున్నార్ననారు. హైదరాబాద్ తప్ప మిగతా 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించారని, ఇందుకు ధన్యావాదాలు అన్నారు.

- తెలంగాణలో 80 శాతానికి పైగా దళితులు, ఓబీసీలు ఉన్నారని చెప్పారు. వెనుకబడిన తరగతుల అభివృద్ధికి సహకారం అందించాలని కోరుతున్నానని చెప్పారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్త గురించి నేను మీకు కొత్తగా చెప్పేది ఏమీ లేదన్నారు. తెలంగాణకు ఉన్న ప్రధాన వనరు సాగునరు అన్నారు. తెలంగాణకు సాగునీటిని అందించేందుకు ఓ జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని కోరుతున్నానని చెప్పారు.

దత్తాత్రేయ స్వాగత ఉపన్యాసం

- మోడీ అంటే సంతోషాన్ని పంచేవారని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. అన్ని అవయవాలు సరిగా పని చేస్తేనే దేహం పని చేస్తుందని, అలాగే అన్ని రాష్ట్రాలు పని చేస్తేనే దేశం తలెత్తుకొనే విధంగా ఉంటుందన్నారు. రాజకీయాలు కపటంతో సాగినా, అభివృద్ధి మాత్రం పరస్పర సహకారంతో సాగుతాయ్నారు. ప్రభుత్వం ఈ రోజు ఉండవచ్చు, రేపు మారవచ్చునని, ప్రజలు మాత్రం శాశ్వతం అన్నారు.

- ప్రజల కోసం కలిసి పని చేయాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రధాని మోడీ తొలిసారి రావడంమ సంతోషకరమన్నారు. ఈ రోజు చాలా గొప్ప రోజు అన్నారు. మనిషికి జవనాధారం నీరు మాత్రమే అన్నారు. మిషన్ భగీరథను ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషకరమన్నారు. ప్రధాని మోడీకి అందరూ చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని దత్తాత్రేయ అన్నారు.

- ప్రధాని మోడీకి, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు తదితరులకు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

- ప్రధాని మోడీ.. 1600 మెగావాట్ల రామగుండం థర్మల్ పవర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంటును ఆవిష్కరించారు. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరణకు శంకుస్థాపన. మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే లైనుకు శంకుస్థాపన చేశారు.
- ప్రతి ఇంటికి నల్లా నీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యం. మిషన్ భగీరథతో 243 గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించనున్నారు.
- అనంతరం ప్రధాని మోడీ వాటర్ గ్రిడ్, మిషన్ భగీరథ ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు. సీఎం కేసీఆర్ ఆయనకు వివరించారు.
- నీటి సరఫరా పంపును ప్రధాని మోడీ ఆవిష్కరించారు. నల్లా ద్వారా నీటిని విడుదల చేశారు.

- ప్రధాని మోడీ మిషన్ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. అలాగే మిషన్ భగీరథ శిలాపథకాన్ని ఆవిష్కరించారు.
- ప్రధాని మోడీకి పూర్ణ కుంభంతో పండితులు స్వాగతం పలికారు. అంతకుముందే అక్కడ సుదర్శన యాగం నిర్వహించారు. యాగం భస్మ ప్రసాదాన్ని పండితులు ప్రధాని మోడీకి అందించారు.
- ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం గం.3.15కు కోమటిబండ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

- విభజన అనంతరం ప్రధాని మోడీ ఒక్కసారి కూడా తెలంగాణలో అడుగుపెట్టకపోవడంపై గతంలో తెరాస సహా అన్ని విపక్షాలు విమర్శించాయి. రెండేళ్ల తర్వాత వచ్చిన ప్రధాని మోడీ.. తెలంగాణకు తీపి కబురు చెబుతారని ఇప్పుడు బీజేపీతో పాటు అధికార తెరాస భావిస్తోంది.
- ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మరోవైపు బీజేపీ సందడి కూడా నగరంలో కనిపిస్తోంది. బేగంపేట, ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మోడీ రాకతో వారిలో నూతనోత్సాహం వెల్లువిరుస్తోంది.

- ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో గజ్వెల్ బయలుదేరారు. ఆయన వెంట కేంద్రమంత్రులు వెంకయ్య, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు ఉన్నారు.
- ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు స్వాగతం పలికారు.

- ప్రధాని మోడీ రెండు గంటల ఇరవై నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కేసీఆర్ తదితరులు ఎదురుగా వెళ్లారు.
- ప్రధాని రాక కోసం వారు విమానాశ్రయంలో నిరీక్షించారు.
- ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు చేరుకున్నారు.

English summary
Prime Minister Narendra modi arrives Hyderabad, Telangana on Sunday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X