పిఎన్బీ స్కామ్: మెహుల్ చోక్సీకి భూకేటాయింపుపై తెలంగాణ ఆరా
హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన పాత్రధారి నీరవ్ మోడీ మేనమామ మెహుల్ చోక్సీకి జరిగిన భూకేటాయింపుపై తెలంగాణ ప్రభుత్వం ఆరా తీస్తోంది. రంగారెడ్డి జిల్లాలోని రావిరాలలో రాజీవ్ జెమ్స్ పార్క్ సెజ్‌లో మెహుల్ చాక్సీకి భూమి కేటాయింపు జరిగిన విషయం తెలిసిందే.
ఆ భూమి కేటాయింపులో జరిగిన అక్రమాలపై నివేదికలు సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం రంగా రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నుంచి నివేదికలు కోరింది.

కాంగ్రెసు ప్రభుత్వం 2005లో రాజీవ్ జెమ్స్ పార్కు సెజ్‌లో గీతాంజలి గ్రూప్‌నుకు 95 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో ఆభరణాలు, వాచీల తయారీ యూనిట్‌ను స్థాపిస్తానని గీతాంజలి హామీ ఇచ్చింది.
ఆభరణాల తయారీలో, వజ్రాల కట్టింగ్, పాలిషింగ్‌లో శిక్షణ ఇవ్వడానికి ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కూడా గీతాంజలి చెప్పింది. సెజ్ హైదరాబాదుకు అత్యంత సమీపంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications