బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచ‌ర్‌ కు యావ‌జ్జీవ శిక్ష‌.. ఎక్కడంటే..?

ఇటీవలికాలంలో సమాజంలో మహిళలపైనే కాదు.. చిన్నారులు, బాలురపైనా అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా కొందరు మృగాలు ప్రవర్తిస్తున్నాయి. వావి వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్న వారు పెరిగిపోతున్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువునే అందరూ ఆరాధిస్తారు. అయితే అలాంటి టీచర్ స్థానంలో ఉన్నవాళ్లే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతూ వారి జీవితాలను ఆగం చేస్తున్నారు. చిన్నారుల సంరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోక్సో, నిర్భయ, దిశ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. కఠినంగా శిక్షించినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఓ బాలుడిపై లైంగిక దాడికి పాల్ప‌డిన కేసులో నిందితుడైన ఉపాధ్యాయుడికి కోర్టు యావ‌జ్జీవ కారాగార శిక్ష విధించింది. అంతేకాక రూ.25,500 జ‌రిమానాతో పాటు బాధితుడికి 2,00,000 ప‌రిహారం అందించాల‌ని కోర్టు ఆదేశించింది. ఈమేర‌కు ఎల్బీ నగర్‌ లోని రంగారెడ్డి జిల్లా రేప్, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మంగ‌ళ‌వారం తీర్పు వెలువ‌రించారు. దాంతో ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫిర్యాదుదారుడి పెద్ద‌ కుమారుడు (13) మామిడిపల్లిలోని ఇస్లామియా కాషిఫుల్ ఉలూమ్ మదర్సాలో చదువుకుంటున్నాడు. అయితే ఆ బాలుడు అనారోగ్యం బారిన పడడంతో 2024, డిసెంబ‌ర్ 26 న‌ తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు. తెళ్లారి డిసెంబర్ 27న‌ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే బాలుడి ప్రైవేట్ అవయవాల వద్ద తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

POCSO case latest Teacher gets life sentence inPOCSO case for sexually assaulting boy in Hyderabad

దాంతో బాలుడు తన తల్లికి జరిగిన విషయం చెప్పాడు. బిహార్ లోని పూర్ణియా జిల్లా ద‌రియాపూర్ కు చెందిన హఫీజ్ మునావర్ హుస్సేన్ (30) అదే మదర్సాలో టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పిల్లలకు చదువు చెబుతూ మామిడిపల్లిలోనే ఉంటున్నాడు. అయితే 2024, డిసెంబ‌ర్ 25న సాయంత్రం సమయంలో బాలుడిని వాహనంపై ఎక్కించుకుని పహాడీషరీఫ్, రాజీవ్ గాంధీ నగర్‌ లోని మసీద్- ఎ -రహమత్ ఉన్నీసా సమీపంలోని ఒక గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఎవరికీ చెప్పొద్దని బెదిరింపులకు గురిచేసినట్లు బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ మేరకు నేరం రుజువు కావ‌డంతో కోర్టు శిక్ష విధించిందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+