మానవ మృగాలకు చెక్.. మహబూబాబాద్‌ జిల్లాతో పాటు జనగామ జిల్లాలో పోక్సో కోర్టుల ఏర్పాటు

గిరిజన,ఆదివాసీ తండాలలో చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లకు కఠిన శిక్షలు విధించడానికి న్యాయ వ్యవస్థలో సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తుంది తెలంగాణా ప్రభుత్వం .18 ఏళ్ల లోపు ఉన్న బాల బాలికల సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పోక్సో చట్టం పకడ్బందీగా అమలు అయ్యేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బాధిత చిన్నారులకు తక్షణ న్యాయం జరిగేలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తుంది. చిన్నారులపై అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పోక్సో కోర్టును ఏర్పాటు చేసింది.

మహబూబాబాద్ లోనూ, జనగామలోనూ పోక్సో కోర్టులు

మహబూబాబాద్ లోనూ, జనగామలోనూ పోక్సో కోర్టులు

చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే మృగాళ్లను కఠినంగా శిక్షించేందుకు రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో కోర్టును ఏర్పాటు చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇక ఇదే సమయంలో జనగామ జిల్లాలోనూ పోక్సో కోర్టును ఏర్పాటు చేశారు. గిరిజనులు అధికంగా ఉండే మహబూబాబాద్ జిల్లాతో పాటు జనగామ జిల్లాలోనూ పోక్సో కోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీన్ని సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

సత్వర న్యాయం జరిగేలా పోక్సో కోర్టుల ఏర్పాటు

సత్వర న్యాయం జరిగేలా పోక్సో కోర్టుల ఏర్పాటు

ముఖ్యంగా గిరిజన, ఆదివాసీల పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులు చాలా సందర్భాలలో శిక్ష నుండి తప్పించుకుంటున్నారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి గిరిజన సమాజానికి అండగా నిలిచేందుకు న్యాయవ్యవస్థ, తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాలో చిన్నారులపై జరిగిన నేరాల విచారణను వేగవంతం చేసేందుకు పోక్సో కోర్టును ఏర్పాటు చేశారు. సత్వర న్యాయం జరిగేలా, బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని న్యాయమూర్తికి అక్కడే చెప్పుకునేలా పోక్సో కోర్టును ఏర్పాటు చేయడం ఈ నేరాలకు కొంతమేర చెక్ పెడుతుందన్న భావన వ్యక్తమవుతోంది.

ఆ బాలబాలికల వివరాలు గోప్యంగా ఉంటాయి

ఆ బాలబాలికల వివరాలు గోప్యంగా ఉంటాయి

లైంగిక దాడులకు గురైన బాలబాలికల వివరాలు గోప్యంగా ఉంచడం, విచారణకు హాజరు అయ్యే బాలబాలికల తల్లిదండ్రులను, చిన్నారులను బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ కోర్టులలో ప్రధానంగా కనిపిస్తుంది. బాధితులలో భయం పోగొట్టడం తో పాటుగా, వారి గౌరవాన్ని కాపాడటం, సత్వర న్యాయం అందించడమే పోక్సో కోర్టుల ప్రధాన ఉద్దేశం. అత్యాధునిక సౌకర్యాలతో, బాధితుల నుండి సమాచారం తెలుసుకోవడానికి అనువైన వాతావరణంతో, ప్రత్యేక సౌకర్యాలతో ఈ కోర్టులను నిర్మించారు.

అత్యధికంగా గిరిజనులే ఉండే మహబూబాబాద్ జిల్లాలో పోక్సో కోర్టుతో వారికి న్యాయం

అత్యధికంగా గిరిజనులే ఉండే మహబూబాబాద్ జిల్లాలో పోక్సో కోర్టుతో వారికి న్యాయం

ఇదిలా ఉంటే మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా గిరిజనులే ఉండటంతో, గిరిజన ప్రాంతాలలో బాలికలపై లైంగిక వేధింపులపై ప్రధానంగా పోక్సో కోర్టులు పని చెయ్యనున్నాయి. మారుమూల గిరిజన గ్రామాలలో బాలికలపై అఘాయిత్యాలు జరిగినా వారికి న్యాయం జరగటం లేదు. చాలా కేసుల్లో బాలికలు చిన్నారులకు జన్మనిస్తున్న దుస్థితి కూడా వస్తుంది . ఈ క్రమంలో వారి కోసం పోక్సో కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+