ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ (ఫోటోలు)

హైదరాబాద్: ఇల్లు అద్దెకు కావాలని యజమానికి ఫోన్ చేసి పిలిపించి దోచుకెళ్లారు. ఈ కేసులో ఐదుగురి నిందితులను పేట్ బషీరాబాద్ పోవలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం పీఎస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో బాలానగర్ ఇన్‌చార్జి డీసీపీ శ్రీనివాసరెడ్డి వివరాలను వెల్లడించారు.

కుత్బుల్లా పూర్ సర్కిల్ పరిధి గోదావరి హోమ్స్‌లో బలుసు రమేశ్ బాబు నివాసం ఉంటాడు. ఇతనికి జేకేనగర్‌లో మరో ఇల్లు ఉంది. జులై 16న జేకేనగర్‌లోని ఇంటి సెల్లార్ అద్దెకు కావాలని గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన పొట్టసిరి అంకారావు అలియాస్ కండు శర్మ (36) గేటు మీద ఉన్న నెంబర్‌కు ఫోన్ చేశాడు.

ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ

ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ


రమేశ్‌బాబు అక్కడికి వెళ్లగానే శర్మతో పాటు అద్దంకి రమేశ్ (40), జలగం నాగేంద్ర బాబు (24), వజ్రోజి చంద్రమౌళి (52), పొట్టసిరి చిన్న శంకర్ (48)లతో కలిసి బెదిరించి బంధించారు. అతని ఒంటిపై ఉన్న తులం బంగారు గొలుసు, రెండున్నర తులాల బరువు కలిగిన రెండు ఉంగరాలను దోచుకున్నారు.

 ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ

ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ


జేబులో ఉన్న ఏటీఎంతో రూ. 50 వేలను డ్రా చేశారు. అంతటితో ఆగకుండా అతని అకౌంట్‌లో ఉన్న రూ. 14 లక్షలు ఇవ్వాలని, జీడిమెట్ల గ్రామంలోని హెచ్‌డీ‌ఎఫ్‌సీ బ్యాంకు వద్దకు తీసుకెల్లారు. రమేశ్ బాబును బ్యాంకులోకి పంపించి నగదు డ్రా చేసుకుని రావాలని బయట శర్మ, మరో నలుగురు యువకులు ఎదురు చూస్తున్నారు.

 ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ

ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ


బాధితుడు బ్యాంకు మేనేజర్ సాయంతో పోలీసులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి వచ్చే సరికి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. ఈ నెల 11న సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఐదుగురు వ్యక్తులు అనుమానంగా తిరుగుతుండగా క్రైం సిబ్బంది పట్టుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు.

 ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ

ఇల్లు అద్దెకు కావాలంటూ ఫోన్ చేసి దోపిడీ


ఐదుగురు నిందితులను బుధవారం రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి మూడున్నర తులాల బంగారం, రూ. 50వేల నగదుతో పాటు ఐదు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+