కారు కొనేందుకు చోరీ, చివరకు జైలు పాలు

హైదరాబాద్: కారులో తిరగాలనే కోరికే అతడిని జైలు పాలు చేసింది. కారు కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు కోసం తన తల్లి పనిచేస్తున్న ఇంట్లోనే దొంగతనాన్ని యత్నించి దొరికిపోయాడు ఓ యువకుడు.

బంజార్ హిల్స్ పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్ ఐసీ కాలనీలో నివసించే సినీ డిస్ట్రిబ్యూటర్, బిల్డర్ సుధాకర్ ఇంట్లో పద్మ అనే మహిళ గత నాలుగేళ్లుగా పని చేస్తోంది. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం 5.30కి పద్మ పని ముగించుకొని ఇంటికి వెళ్లింది.

police arrest man in robbery attempt at hyderabad

కొద్దిసేపటి తర్వాత పద్మ కుమారుడు దుర్గా ప్రసాద్ (20) ఆ ఇంట్లోకి చొరబడి ఓనర్‌పై కత్తితో దాడికి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇరువురి మధ్య పెనుగులాట జరిగి, ఇంటి ఓనర్ చేతికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంటి ఓనర్ అరుపులు విని అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు వెంటనే వచ్చి దుర్గాప్రసాద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. యజమానురాలిని కత్తితో పొడిచి ఇంట్లో ఉన్న డబ్బు, నగదు కాజేయాలని పథకం వేసుకొని అక్కడకి వచ్చినట్లు పోలీసుల విచారణలో నిందితుడు దుర్గా ప్రసాద్ వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+