• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మత్తు మందు కలిసిన స్టాంప్ పేపర్లు: చాలా ఖరీదు గురూ (ఫోటోలు)

By Nageshwara Rao
|

హైదరాబాద్: నగరంలో డ్రగ్ మాఫియా వెలుగులోకి వచ్చింది. స్టాంపు పేపర్లపై మత్తు మందు చల్లి యువతను ఆకర్శిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ఎల్‌ఎస్టీ డ్రగ్ విక్రయిస్తున్న ముగ్గురు విద్యార్థులను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు.

డ్రగ్ సరఫరాపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఓ పథకం ప్రకారం ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల బృందంలోని ఒకరు ఎల్‌ఎస్డీ డ్రగ్స్ కావాలంటూ బోయిన్‌పల్లి ప్రాంతానికి చెందిన సాద్ మహ్మద్(20)ను ఫోన్‌లో సంప్రదించారు.

దీంతో అతడు ఈ డ్రగ్ చాలా ఖరీదవుతుందని.. బోయిన్‌పల్లి డైమండ్ పాయింట్ హోటల్ వద్దకు వస్తే ఇస్తానని చెప్పాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఎల్‌ఎస్డీ డ్రగ్స్ 32 స్టాంప్‌లతో సాద్ మహ్మద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని విచారించగా మరో ముగ్గురి పేర్లు వెల్లడించాడు.

దీంతో మహ్మద్ ముజాబీనుద్దీన్, నిఖిల్ రోచ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు ప్రతీక్ బీజం పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి రూ.11 వేలు, మూడు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

ఎల్‌ఎస్డీ డ్రగ్‌ను మెడికల్ భాషలో లీసెర్జిక్ యాసిడ్ డైత్లామైడ్ అంటారు. ఈ డ్రగ్ డ్రాప్స్‌ను బ్లాటింగ్ స్టాంప్ పేపర్ మీద వేసి దాన్ని నాలుక కింద పెడతారు. అలా ఆ డ్రగ్‌ను మెల్లిమెల్లిగా పీలుస్తూ నషాలోకి వెళ్లిపోతారు. ఇలా డ్రగ్‌ను తీసుకోవడంలో ఆ వ్యక్తి పది గంటల పాటు ఎలాంటి అలసట లేకుండా ఉత్తేజంగా, ఉల్లాసంగా ఏ పనైనా సునాయసంగా చేయగలిగే శక్తిని ఇస్తుందని పోలీసులు విచారణలో గుర్తించారు.

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

అయితే, దీన్ని ఎక్కువగా తీసుకుంటే ప్రాణానికి హానికరమని తెలిపారు. చాలా మంది యువత వీకెండ్ పార్టీలు, పబ్‌లలో నృత్యాలు చేసే సమయంలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారని దర్యాప్తులో తేలింది. తాజాగా నగరంలో ఈ డ్రగ్స్‌కు అలవాటు పడ్డ యువత నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ ముగ్గురు గోవా నుంచి దీన్నా ఇక్కడికి తీసుకువచ్చి దందా చేస్తున్నారు. ఒక్కో ఎల్‌ఎస్డీ స్టాంప్ పేపర్‌ను రూ.1700 నుంచి 2 వేల వరకు విక్రయిస్తున్నారు.

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

బోయిన్‌పల్లి భావన కాలనీకి చెందిన సాద్ మహ్మద్ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అతడి మేనమామ మన్సూర్ ఖాన్ వీరిని పోషిస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో సాద్ మహ్మద్‌కు గంజాయి తాగడం అలవాటైంది. ఆ తర్వాత స్నేహితుడు రాఘవ్‌తో కలిసి ఎల్‌ఎస్డీ డ్రగ్స్, చరస్ తీసుకోవడం నేర్చుకున్నాడు.

 గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

ఇలా అలవాటైన సాద్ డ్రగ్స్, చరస్ కోసం గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్ ప్రాంతాలకు వెళుతుండే వాడు. ఈ క్రమంలో గోవాలో ఓ వ్యక్తి పరిచయమై ఎల్‌ఎస్డీ డ్రగ్స్‌ను హైదరాబాద్‌లో విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఇద్దరు గోవా, కసోల్ నుంచి డ్రగ్స్‌ను తీసుకువచ్చి సిటీలో అధిక ధరలకు అమ్ముతున్నారు.

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

గుట్టు రట్టు: స్టాంప్ పేపర్లపై మత్తుమందు

ఒక ఎల్‌ఎస్డీ స్టాంప్ డ్రగ్‌కు రూ.500 నుంచి వెయ్యి మిగులుతుండడంతో ఆర్థికంగా బాగుందని వీరు ఈ వ్యాపారాన్ని పెంచారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌తో పాటు ఫేస్‌బుక్, మెసేంజర్ల ద్వారా డ్రగ్స్ వాడకందారుల గ్రూపులను తయారు చేసి కావాల్సిన వారికి వీరు ఏడాది నుంచి సరఫరా చేస్తున్నారు.

English summary
Police Arrested Drug Mafia Gang in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X