'డ్రగ్స్' మత్తులో రెచ్చిపోయిన నైజీరియన్: అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: రంజాన్ ప్రార్ధనంలు ముగించుకొని వస్తున్న వారిపై తాగిన మైకంలో నైజీరియా దేశస్తుడు దాడి చేసిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బంజారాహిల్స్ జహీర్‌నగర్‌లో నైజీరియాకు చెందిన ఆంగ్రూ అనే యువకుడు అద్దె కుంటున్నాడు. ఇతను కొద్ది రోజులుగా ప్రతి రోజు పీకల దాకా మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకొని సాయంత్రం కాగానే వీధుల్లో తిరుగుతూ ఆ ప్రాంతంలోని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.
శుక్రవారం మధ్యాహ్నం ఇక్కడి ఓ పాన్ షాపులో సిగరెట్ తీసుకొని డబ్బు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడిగిన వ్యాపారిపై దాడి కూడా చేశాడని తెలుస్తోంది. ఇదేంటని అక్కడే ఉన్న కొందరు స్ధానికులు ప్రశ్నించగా వారిపై కూడా దాడి చేశాడు.

ఆ తర్వాత మసీద్‌లో రంజాన్ మాస ప్రార్ధనలు ముగించుకొని బయటకు వస్తున్న పలువురిపై దాడికి తెగబడ్డాడు. అంతేకాకుండా జాతి, మత దూషణకు కూడా పాల్పడ్డాడు. దీంతో వందలాది మంది ముస్లింలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.
దీంతో బంజారాహిల్స్‌లో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి నైజీరియన్‌ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యంతో పాటు డ్రగ్స్ తీసుకోవడంతో మత్తులో అతను ఇలా ప్రవర్తించాడని పోలీసులు భావిస్తున్నారు.
నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పాటు జహీర్ నగర్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెట్‌ను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications